twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మందిరాబేడీ ప్రక్కలో అనీల్ కుంబ్లే?

    By Staff
    |

    Mandira Bedi
    అనీల్ కుంబ్లే నిన్నటి దాకా మీరాభాయ్ నాట్ అవుట్ అనే సినిమా రిలీజ్ కోసం డెస్పరేట్ గా ఎదురు చూస్తున్నాడు. అయితే ఈరోజు సీన్ మారి పోయింది. మందిరాబేడీతో అతను ప్రక్క పంచుకున్నట్లు పోస్టర్స్ రిలీజ్ చేయగానే షాక్ కి గురయ్యాడు. నిజానికి అతను ఆ సినిమాలో అతిధి పాత్ర చేస్తున్నాడు. మీరాబాయ్ అనే లెక్కల లెక్చరర్ క్రికెట్ పిచ్చితో కథ నడుస్తుంది. పెళ్ళయినా భర్తను కూడా పట్టించుకోకుండా ఆమె అనిల్ కుంబ్లే అంటే విపరీతమైన ప్రేమ కురిపిస్తూంటుంది. అదే విషయాన్ని దర్శకుడు తన క్రియేటివిటీతో పోస్టర్ కెక్కించాడు.ప్రీతీష్ నంది కార్పోరేషన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇటువంటి పోస్టర్స్ తాను ఊహించలేదని ఇప్పుడు అనిల్ కుంబ్లే నిర్మాతలను సంప్రదిస్తున్నాడని సమాచారం.

    అలాగే అంత క్రియేటివ్ ప్రీడమ్ ఉండకూడదని వాదిస్తున్నాడు. అయితే నిర్మాత రంగిత నంది మాత్రం అనీల్ ఇంతకా ఫీల్ అవ్వాల్సింది లేదని ..ఇదంతా ఫన్ ధింగ్ అని కొట్టిపాడేస్తున్నాడు. ఈ సినిమాలో క్రికెట్ ని విపరీతంగా ప్రేమించే అమ్మాయి అదే మూడ్ లో అనీల్ తో ప్రేమలో మునిగిపోవటం చూపెడుతున్నాం. అన్నీ తెలిసే కదా అనీల్ నటించింది అని చెప్తున్నాడు. మందిరాబేడీ ఈ విషయమై స్పందిస్తూ...నేను పోస్టర్ చూడగానే అనుకున్నా ఇదేదో గొడవ తెచ్చేదిగా ఉందని..అయితే అది నిర్మాతలు,అనీల్ తేల్చుకోవాల్సిన పర్శనల్ విషయం అని తెలివిగా వ్యాఖ్యానించింది.ఇక అనీల్ కుంబ్లే సోదరుడు దినేష్ కుంబ్లే దీనిపై స్పందించటానికి మేటర్ ఏం లేదన్నాడు.క్రికెట్ మాత్రమే తన అన్నకు తెలుసంటూ కామెంట్ చేసాడు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X