తెలుగు సిన్మాలో మందిరాబేడీ
ప్రపంచ కప్ క్రికెట్ పోటీలలో క్రికెట్ షోల ద్వారా కోట్లాది భారతీయల హృదయాలు కొల్లగొట్టిన మందిరా బేడీకి తెలుగులో మెల్లగా అవకాశాలు వస్తున్నాయి. త్వరలో తానొక తెలుగు సినిమాలో నటించబోతున్నట్లు మందిర ప్రకటించింది.
క్రికెట్ షోస్ ద్వారా, టీవీ గేమ్ షోస్ ద్వారా దేశంలో నాకంటూ ఒక మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత దక్షిణాది మొదటిసారిగా శింబు చిత్రం మన్మథన్‌లో నటించాను. అది తమిళంలో విజయవంతం కావడమే కాకుండా తెలుగులో కూడా హిట్ అయింది. బహుశా దాని ద్వారానే నన్నూ ఒక నటిగా తెలుగు నిర్మాతలు గుర్తించి ఉంటారు. ఇప్పుడిప్పుడే అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఒక తెలుగు చిత్రంలో నటిస్తున్నాను అని చెప్పారు మందిరా బేడీ.
సినీవర్గాల సమాచారం ప్రకారం ఒక సీనియర్ హీరో సరసన నటించడానికి మందిర అంగీకరించిందని, ఆ సినిమా ఆగస్టు నెలలోనే ప్రారంభం అవుతుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











