తెలుగుతెరపై మందిరాబేడీ
క్రికెట్ వరల్డ్ కప్ ప్రసారాల్లో యాంకర్ (స్లీవ్‌లెస్) మందిరా బేడీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ఆమె బాడీ లాంగ్వేజ్ యువతరాన్ని వెర్రెత్తించిన ఆమెకు బాలీవుడ్‌లో అనేక అవకాశాలు వచ్చాయి. ఒక తమిళ సినిమాతో ఆమె దక్షిణాదిలో అడుగు పెట్టింది. ఆ సినిమాలో ఆమె సరసన శింబు నటించాడు. నిధి ప్రసాద్ దర్శకత్వంలో ఆమె ఒక తెలుగు సినిమాలో నటించనున్నారు. ఈ సినిమా కథ తనకు బాగా నచ్చిందని, తన పాత్రకు ఎంతో ప్రాధాన్యం ఉందని మందిరా బేడీ చెబుతోంది. ఈ సినిమాలో ఆమె సరసన ఒక సీనియర్ హీరో నటించనున్నట్టు తెలిసింది. దర్శకుడు నిధి ప్రసాద్ గతంలో నిధి, కలుసుకోవాలని, అందరూ దొంగలే సినిమాలకు దర్శకత్వం వహించారు. సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై రాజు, ప్రవీణ్ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జులైలో ప్రారంభమవుతుంది.


Click it and Unblock the Notifications