అరుంధతి మూసలో.. అఘోరా యాసలో మరో...
సూపర్ హిట్టయిన అరుంధతి, మగధీర మూసలో మరిన్ని చిత్రాలు రానున్నాయి. తాజాగా 'మండోత్కరి' (లివింగ్ ఫర్ రివెంజ్) అనే చిత్రం రెడీ అవుతోంది. ఈ చిత్రం కథ కూడా పునర్జన్మ,ప్రతీకారం చుట్టూ తిరుగుతుంది.ఈ చిత్ర కథాంశాన్ని దర్శకుడు వివరిస్తూ, 'కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక రాజుకు భార్యలుగా ఉన్న ఇద్దరు రాణులు మండోత్కరి, వేదవతి రాజ్యాధికారం కోసం కత్తులు దూసుకుంటారు. ఆ యుద్ధంలో మరణించిన మండోత్కరి తీరని కోరికతో ఆత్మగా మారి మరుజన్మలో వేదగా జన్మించిన వేదవతి మీద ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది. దీని నుంచి వేద ఎలా బయటపడిందన్న ఆసక్తికర కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది అన్నారు. అఘోరానుంచి అరుంధతి బయిట పడినట్లు ఈ కథనం రాసుకున్నారని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో 45 నిమిషాల గ్రాఫిక్స్ పెట్టారని నిర్మాతలు చెప్తున్నారు. శ్వేతారాయ్ ప్రధాన పాత్రధారిగా ఈ చిత్రంలో కనిపించనుంది. కథను, కథనాన్ని అనుసరించవచ్చేమో గానీ హిట్టుని అనుకరించటం కష్టమే కదా..చూద్దాం ఏం జరగనుందో..


Click it and Unblock the Notifications











