‘మండోదరి’ మూవీ విశేషాలు (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: 'తెలుగు వారి సినిమా' బేనర్ పై కొండా రాజేష్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ నూతన నటీనటులతో పిడుగు సుబ్బారావు నిర్మాతగా మారి రూపొందిస్తున్న సినిమా 'మండోదరి'. ఈ చిత్రం ఈ నెల 2న గుంటూరు విజ్ఞాన్ యూనివర్శిటీలో మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ చేతుల మీదుగా ప్రారంభం అయింది.
'మండోదరి' సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ.... 'ఇది నలుగురు కుర్రాళ్లు, ఒక అమ్మాయి మధ్య జరిగే లవ్ ఎంటర్ టైనర్. గుంటూరులో మొత్తం 14 రోజులు షూటింగ్ చేశాం. రెండో షెడ్యూల్ ఈ సోమవారం నుంచి హైదరాబాద్ లో ప్రారంభించాం. ఈ షెడ్యూల్ ఏకధాటిగా 60 రోజుల పాటు జరుగుతుంది. ఫిబ్రవరి 20 నుంచి కడపజిల్లా గండికోటలో క్లైమాక్స్ కు సంబంధించినన విలేజ్ ఎపిసోడ్స్ చిత్రీకరిస్తాం. ఆ తరువాత అక్కడే ఒక పాటను మరియు టైటిల్ కు చెందని ఒక శ్లోకాన్ని చిత్రీకరిస్తామన్నారు.
'మండోదరి' అన్న వెరైటీ టైటిల్ విషయానికొస్తే ఈ టైటిల్ మా సబ్జెక్టుకు నూరు శాతం యాప్ట్ గా ఉంటుంది. ఇది పూర్తిగా యూత్ ఎంటర్‌టైనర్. యూత్ ను ఉర్రూతలూగించే చిత్రం. ఈచిత్రానికి చిన్ని చరణ్ సంగీతం మరో ఎస్సెట్ గా నిలుస్తుంది. చిన్ని ఇప్పటికే చాలా ట్యూన్స్ ఇచ్చారు. అన్ని వర్గాల వారికి ఈచిత్రం నచ్చుతుంది. ఈ సినిమా సబ్జెక్టు కోసం ఏడాది పాటు వర్క్ చేసాం. కొత్తవారికి నటనలో శిక్షణ ఇచ్చాం' అన్నారు.

మండోదరి మూవీ స్టిల్స్.

మండోదరి మూవీ స్టిల్స్.

మండోదరి మూవీ స్టిల్స్.

మండోదరి మూవీ స్టిల్స్.

మండోదరి మూవీ స్టిల్స్.

మండోదరి మూవీ స్టిల్స్.

మండోదరి మూవీ స్టిల్స్.

మండోదరి మూవీ స్టిల్స్.

మండోదరి మూవీ స్టిల్స్.

మండోదరి మూవీ స్టిల్స్.

మండోదరి మూవీ స్టిల్స్.

మండోదరి మూవీ స్టిల్స్.

మండోదరి మూవీ స్టిల్స్.
ఈ చిత్రంలో విజయ్, దినేష్, శ్రీపాల్, శశాంక్, సమత, వెంకట్, వేణుగోపాల్, జూ రేలంగి, శ్రావణి, భావన, ఇంద్రాణి, ముఖ్య పాత్రలో జూనియర్ రవితేజ నటిస్తున్నారు. చిన్ని చరణ్ సంగీతం అందిస్తున్న ఈచిత్రానికి కథ: భీమేశ్వర ఆచారి, ఛాయాగ్రహణం: డి. వెంకటరాజు, ఎడిటింగ్: ఎం.లక్ష్మీ నారాయణ, ఫైట్స్: ప్రకాష్, ఆర్ట్: అడ్డాల చంటి, నృత్యం: ఆర్.కె.విజయ్, దినేష్, శ్రీపాల్, శశాంక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ద్రూ కుమార్, నిర్మాత: పిడుగు సుబ్బారావు, దర్శకత్వం: కొండా రాజేష్.


Click it and Unblock the Notifications











