»   » నిర్మాతపై దాడి: అసభ్యంగా ప్రవర్తించాడన్న మంగారెడ్డి

నిర్మాతపై దాడి: అసభ్యంగా ప్రవర్తించాడన్న మంగారెడ్డి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీ నిర్మాత శరత్ కుమార్‌పై సెన్సార్ బోర్డు సభ్యురాలు మంగారెడ్డి దాడి చేసిన ఘనటపై ఆమె స్పందించారు. తాను కావాలని దాడి చేయలేదని, ఆత్మరక్షణ కోసం తాను ప్రతిఘటించగా అతను కిండపడిపోయాడని, ఈ క్రమంలోనే అతనికి గాయమైందని తెలిపారు. శరత్ కుమార్, తాను గత 10 సంవత్సరాలుగా ప్రెండ్స్ అని మంగారెడ్డి చెప్పడం విశేషం.

తాను ఫేస్ బుక్ లో ఓ పోస్టు చేయగా దానికి ఆయన అసభ్యంగా కామెంట్స్ చేసాడని... అందుకు సంబంధించిన వివరాలను ఆమె మీడియాకు చూపించారు. ఫేస్ బుక్ చాటింగులో తన బట్టల గురించి అసభ్యంగా మాట్లాడినట్లు ఆమె తెలిపారు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడినట్లు తెలిపారు. తనకు కోపం వచ్చి రాత్రి 12.30 గంటలకు అతని ఇంటికి వెళ్లానని, కాస్త గట్టిగానే మాట్లాడినట్లు తెలిపారు. ఈ క్రమంలో అతను నాపై దాడి చేయడానికి ప్రయత్నించడానికి, తాను పక్కనే ఒక స్టిక్ ఉంటే అడ్డంగా పెట్టుకున్నానిని, అతను నా చేతిలో స్టిక్ విరిచేసి తన రూంలోకి వెళ్లి తలుపు పెట్టుకోవడానికి ప్రయత్నించాడని, తాను డోర్ తోయడంతో అతను కింద పడిపోయి పక్కనే ఉన్న కూలర్ తాకడంతో గాయమైందని, అంతుకు మించి ఏమీ లేదన్నారు.

Manga Reddy explained about attack

దాడి ఘటనపై మంగారెడ్డిపై ఫిర్యాదు చేసిన శరత్ కుమార్ స్పందిస్తూ...10 ఏళ్ల నుండి తాము ఫ్రెండ్స్‌గా ఉన్నామని, రాత్రి ఉన్నట్టుండి ఒక వ్యక్తితో వచ్చి తనపై దాడి చేసిందని, గతంలో తాము ఇద్దరం కలిసి వీడియో షూట్ చేసామని, తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, ఎందుకు దాడి చేసిందో తెలియదన్నారు. తాము చాలా కాలంగా ఫ్రెండ్స్ గా ఉన్నామని, ఫేస్ బుక్ లో తమ మధ్య అలాంటి చాటింగ్స్ మామూలే అన్నారు.

English summary
Director Sharat Kumar has been reportedly attacked by Censor Board member Manga Reddy. In the attack, the director sustained injuries on his head and he was shifted to a hospital.
Please Wait while comments are loading...