'దంచవే మేనత్త కూతురా' అంటూ అప్పట్లో బాలయ్య హీరోగా వచ్చి మంగమ్మగారి మనవడు చిత్రంలోని పాటను మర్చిపోవటం కష్టమే. ఇప్పుడా పాటని బెల్లంకొండ సురేష్ తన రైడ్ చిత్రంలో రీమిక్స్ చేయనున్నారు. తనీష్, నాని, శ్వేతాబసు ప్రసాద్, అక్ష ప్రధాన పాత్రల్లో నిర్మితమవుతున్న ఈ చిత్రాన్ని రమేష్ వర్మ డైరక్ట్ చేస్తున్నాడు. సింగర్ హేమ చంద్ర ఈ చిత్రంతో సంగీత దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. ఇక ఈ రీమిక్స్ సాంగ్ పై బెల్లంకొండ పూర్తి నమ్మకంగా ఉన్నారు. అందులోనూ బాలకృష్ణకీ,బెల్లంకొండకీ అనుబంధం దృష్టా ఈ పాట పిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ రైడ్ చిత్రం తాము నిర్మిస్తున్న తమిళ పొల్లాదవాన్ రీమేక్ కి బాగా దగ్గరగా ఉందని నిర్మాత జెమినీ కిరణ్ ఆ మధ్య అడిగారని వార్త కూడా వచ్చిన సంగతి విదితమే.