మహేష్ - మణిరత్నం ల సినిమా బడ్జెట్ 100 కోట్లు...!
'మణిరత్నం సినిమాలో నటించే అవకాశం రావడం వల్ల నా చిరకాల వాంచ నెరవేరబోతోంది' అని మహేష్ బాబు ట్విట్టర్లో పోస్ట్ చేసి విషయం తెలిసిందే. అయితే తెలుగు, తమిళ నిర్మించనున్న ఈ చిత్రంలో మహేష్‌తో పాటు తమిళ నటుడు విజయ్, ఆర్యలు కూడా నటిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో కథానాయికగా అనుష్క ప్రధాన పాత్రలో నటించనుందని సమాచారం.
ఈ చిత్రం కల్కి కృష్ణమూర్తి రచించిన ఓ నవల ఆధారంగా ప్రాచీన తమిళ సంస్కృతికి ప్రతిబింబించే రాజుల కథతో రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రంలో మహేష్ ఆదిత్య కరికాలన్ అనే రాజు పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. అలాగే హీరోయిన్ కు మాత్రం ఒక డిఫ్రెంట్ డ్రెస్ కోడ్ ఇస్తున్నట్టు సమాచారం. మణిరత్నం సొంత సంస్థ అయిన మద్రాస్ టాకీస్ 100 కోట్లతో ఈ సినిమా నిర్మించాలనుకుంటుంది. ఈ చిత్రానికి ఎఆర్. రెహ్మాన్ సంగీతాన్ని సమకూరుస్తారు. ఆల్ రెడీ ప్రీప్రొడక్షన్ వర్క్ మొదలైందని ఈ చిత్రం అక్టోబర్ నుండి చిత్రీకరణ జరుపుకోనుందని సమాచారం.


Click it and Unblock the Notifications











