మణిరత్నం శిష్యుడి దర్శకత్వంలో విక్రమ్
విలక్షణ నటుడు విక్రమ్ తర్వలో స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే రావన్ సినిమాలో ఐశ్వర్యరాయ్ భర్తగా నటించి బాలీవుడ్ లో మంచి గర్తింపు తెచ్చుకున్న ఈ హీరో మణిరత్నం శిష్యుడు బేజోయ్ నంబియార్ దర్శకత్వంలో 'డేవిడ్' అనే చిత్రం చేయబోతున్నారు. గతంలో నంబియార్ బాలీవుడ్ లో సైతాన్ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.
'డేవిడ్' చిత్రం గ్యాంగ్ స్టర్ల నేపథ్యంలో సాగినప్పటికీ....కమర్షియల్ అంశాలతో కూడి ఉంటుందని దర్శకుడు చెప్పారు. 2012 ద్వితీయార్థంలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రస్తుతం విక్రమ్ నటించిన 'వీడింతే' చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలవుతోంది. వివిధ విభిన్నమైన గెటప్ లతో విక్రమ్ ఇందులో కనిపించబోతున్నారు. దీక్షాసేథ్ విక్రమ్ సరనన మెయిన్ హీరోయిన్ పాత్ర చేస్తుండగా...శ్రియ, రీమాసేన్, సలోని ఐటం సాంగుల్లో దర్శనం ఇవ్వబోతున్నారు.


Click it and Unblock the Notifications











