మహేశ్ బాబు - విక్రమ్ కాంబినేషన్ లో చిత్రం..డిటేల్స్
సూపర్ స్టార్ మహేశ్ బాబు, జాతీయ ఉత్తమనటుడు విక్రమ్ ల కాంబినేషన్ లో త్వరలో ఓ చిత్రం ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రాన్ని మణిరత్నం దర్శకత్వంలో సన్ పిక్చర్స్ వారు నిర్మించనున్నారు. రజినీకాంత్ రోబో చిత్రం బడ్జెట్ రూ. 160 కోట్లకు మించిన బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తమిళ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక ఈ చిత్రం కధ...దాదాపు 150 ఏళ్ల క్రితం రాజరాజ చోళుని పాలనా, అప్పటి పరిస్థితులను ఆధారంగా చేసుకుని రూపొందిందని చెప్తున్నారు. రావణ్ తో అంతటా విమర్శలు పొందిన మణిరత్నం ఈ చిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
చారిత్రాత్మక కథ నేపధ్యాన్ని తీసుకున్నప్పటికీ కథలో చిన్నచిన్న మార్పులు చేసి ప్రస్తుత సాంకేతి పరిజ్ఞానాన్ని వినియోగించి చిత్రాన్ని భారీగా నిర్మించాలని సన్ పిక్చర్స్ అధినేతి కళానిధి మారన్ భావిస్తున్నారు. రోబో రేంజి దాటి ఈ చిత్రం సంచలనం సృష్టించే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు...శ్రీనువైట్ల దర్శకత్వంలో దూకుడు చిత్రం చేస్తున్నారు. ఇదేకాక మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించడానికి అంగీకారాన్ని తెలిపాడు. ఇటీవల తమిళ దర్శకుడు లింగుస్వామి చెప్పిన సబ్జెక్టు నచ్చడంతో ఓకే చేసాడు.


Click it and Unblock the Notifications











