రామ్ చరణ్ నో: మణిరత్నం నెక్ట్స్ ఫిల్మ్ ‘ఓకే బంగారం’
హైదరాబాద్: సౌతిండియాలోనే కాదు...ఇండియన్ బెస్ట్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న వారిలో మణిరత్నం పేరును ప్రముఖంగా చెప్పుకొవచ్చు. ఆయన దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి, రోజా, బొంబాయి, ఇద్దరు, సఖి, యువ లాంటి చిత్రాను ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అయతే ఈ మధ్య కాలంలో ఆయన చిత్రాలు బాక్సాసువద్ద బోల్తా పడుతూ వస్తున్నాయి. ఆయన గత రెండు చిత్రాలు రావణ్, కడలి అందరినీ నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. తాజాగా మణిరత్నం మరో చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తమిళంలో ‘ఓకే కన్మని' పేరుతో తెరకెక్కించిన చిత్రాన్ని తెలుగులో ‘ఓకే బంగారం'గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది.

షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఒదొక బ్యూటిఫుల్ రొమాంటిక్ డ్రామా చిత్రం. తొలుత తెలుగులో ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేశారు మణిరత్నం. ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయి. కానీ సినిమాలోని పాత్ర తనకు అంతగా సరిపోదని రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని తిరస్కరించారు. దీంతో మమ్ముట్టి తనయుడు దుల్కేర్ సల్మాన్, నిత్యామీనన్ జంటగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణ బాధ్యతల్ని నిర్వహిస్తుండగా, ఎ.ఆర్. రెహమాన్ సంగీతాన్నందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











