విలన్ ఎఫెక్ట్ తో ముంబాయ్ కి మకాం మార్చబోతున్న ‘మణిరత్నం’

By Sindhu

టాలీవుడ్ లో సక్సెస్ అయితేనో సరైన అవకాశాలు లేకనో మన హీరోయిన్స్ బాలీవుడ్, కోలీవుడ్ అంటూ అక్కడికి వలస వెల్లడం తెలిసిందే. ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ శ్రీదేవి, మన జయప్రద, మన రేఖ..ప్రేక్షకులకు అంద, చందాలు పంచి మైమరపింపజేసిన ముద్దుగుమ్మలు. కానీ నాలుగు హిట్లు తగిలిక వీళ్లంతా బాలీవుడ్ కు మకాం మార్చారు. తర్వాత తర్వాత హిందీ చిత్రసీమ సొంత సొత్తుగా మారిపోయారు. చివరకు తెలుగుకు పరాయివాళ్లైపోయారు. ప్రస్తుతం, త్రిష, అసిన్, శ్రియ, సదా హీరోయిన్స్ కే అనుకుంటే ఇప్పుడు హీరో(రాణా)లకు, దర్శకులక్కూడా ఈ జాడ్యం పట్టుకుని రామ్ గోపాల్ వర్మ మనకు దూరమయ్యారు. సినిమాల్లో మేథోవలస ఇంతటితో ఆగలేదు.

తెలుగులో మెగా ట్రెండ్ సెట్టర్ గా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మా మన సెన్సార్‌బోర్డుమీద అలిగి ముంబై చెక్కేశారు. టాలీవుడ్‌ రామ్‌.. ఇప్పుడు బాలీవుడ్‌ కు దత్తపుత్రుడు. అతను మొదలుపెట్టిన ఏ సినిమా అయినా ఓ సంచలనం. డబ్బింగ్ చేస్తే తప్ప..వర్మ సినిమాలు తెలుగువాళ్ల దాకా రావు. దక్షిణాదికి గర్వకారణంగా భావించే దర్శకముత్యం..మణిరత్నం కూడా..రావణ్ సినిమా తర్వాత రూటు మార్చే పనిలో వున్నారు. మూడు భాషల్లో కలిపి రావణ్ వీకెండ్ కలెక్షన్లు 53 కోట్లకే పరిమితమవడం మణిరత్నానికి కళ్లు తెరిపించింది.

ఇంతవరకూ సృజనాత్మకత, నాచురాలిటీలను మాత్రమే నమ్ముకుని..మనసును కదిలించే సినిమాలు తీసిన మణిరత్నం..ఇకనుంచి కమర్షియల్ ఎలిమెంట్‌కే తన ప్రయారిటీ అంటున్నారు. రణబీర్ ‌కపూర్‌ హీరోగా..ఓ కమర్షియల్ ఫిలిమ్‌ తీసి..తనకున్న మార్కెట్ వాల్యూ ఏంటో ప్రూవ్ చేస్తానంటున్నారు మణిరత్నం. దీన్ని తమిళ్‌ లోకిగానీ, తెలుగులోకి గానీ రీమేక్ చేసే ఆలోచనే మణిరత్నంకి లేదట. చెన్నై వదిలి..బాలీవుడ్ ‌లోనే సెటిలవ్వాలనుకుంటున్న మణిరత్నం..దక్షిణాదికి బై చెప్పినట్లే లెక్క.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X