Ponniyin Selvan Twitter Review: తమిళ బాహుబలికి అలాంటి టాక్.. అసలైందే మిస్.. సినిమా చూడొచ్చా అంటే!

గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియాలో భారీ చిత్రాలు రూపొందుతోన్నాయి. అలా ప్రతి భాషలోనూ ఇలాంటి తరహా సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు తమిళంలో వచ్చిన అతి భారీ మూవీనే 'పొన్నియన్ సెల్వన్'. విడుదలకు ముందే భారీ హైప్‌ను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించేసింది. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా మొదటి భాగం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో 'పొన్నియన్ సెల్వన్' మూవీ ట్విట్టర్ రివ్యూపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

తమిళ బాహుబలిగా వచ్చేసింది

తమిళ బాహుబలిగా వచ్చేసింది

ప్రేమకథా చిత్రాల దర్శకుడిగా పేరొందిన మణిరత్నం తెరకెక్కించిన మూవీనే 'పొన్నియన్ సెల్వన్'. ఇందులో విక్రమ్, ఐశ్వర్యరాయ్, త్రిష, కార్తి, జయం రవి, శోభిత ధూళిపాళ్ల సహా ఎంతో మంది స్టార్లు నటించారు. ఈ సినిమాను మణిరత్నం, శుభకరణ్ అల్లిరాజయ్య సంయుక్తంగా నిర్మించారు. ఈ భారీ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు.

అంచనాలు పెంచేసిన అప్డేట్స్

అంచనాలు పెంచేసిన అప్డేట్స్


తమిళ బాహుబలిగా పేరు తెచ్చుకున్న 'పొన్నియన్ సెల్వన్' మూవీ పిరియాడిక్ యాక్షన్‌తో రూపొందింది. దీంతో దీనిపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైన మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు భారీగా వ్యూస్ వచ్చాయి. దీంతో ఈ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా భారీ బజ్ ఏర్పడింది.

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్

'పొన్నియన్ సెల్వన్' మూవీకి తమిళంలో దాదాపు రూ. 65 కోట్ల వరకూ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్ల బిజినెస్ అయింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 35 కోట్లు బిజినెస్ చేసుకుంది. ఇలా మొత్తంగా దీనికి రూ. 130 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. ఇక, అన్ని చోట్లా ఇది గ్రాండ్‌గా విడుదలైంది.

పొన్నియన్ సెల్వన్ టాక్ ఇలా

పొన్నియన్ సెల్వన్ టాక్ ఇలా

కోలీవుడ్ స్టార్స్ నటించిన 'పొన్నియన్ సెల్వన్' మూవీ పిరియాడిక్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఆరంభంలోనే ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఈ మూవీ బాగుందని పలువురు, ఏవరేజ్ అని మరికొందరు ట్వీట్లు చేస్తున్నారు.

ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా

ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా

'పొన్నియన్ సెల్వన్' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే.. ఫస్టాఫ్ మొత్తం టెర్రిఫిక్ ఇంట్రో సీన్‌లతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌లతో అదిరిపోయేలా సాగిపోతుందట. మరీ ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయిందట. అయితే, సెకెండాఫ్ మాత్రం కొంత నిరాశ పరుస్తుందని తెలిసింది. కానీ, క్లైమాక్స్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుందని సినిమా చూసిన వాళ్లు చెప్తున్నారు.

సినిమాలో ప్లస్‌... మైనస్‌లు ఇవే

సినిమాలో ప్లస్‌... మైనస్‌లు ఇవే


తమళంలోనే భారీ బడ్జెట్‌తో వచ్చిన 'పొన్నియన్ సెల్వన్' మూవీని చూసిన వాళ్లంతా ఇచ్చిన రిపోర్టుల ప్రకారం.. ఇందులో అందరి నటన, లవ్ స్టోరీ, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఏఆర్ రెహమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్, విజువల్స్ ఈ సినిమాకు ప్లస్ అయినట్లు తెలిసింది. అయితే, సెకెండాఫ్‌లో స్క్రీన్‌ప్లే, గ్రాఫిక్స్‌లో క్వాలిటీ మిస్ అవడం, కథ ఫ్లాట్‌గా సాగడం దీనికి మైనస్‌గా మారాయట.

ఫైనల్‌గా మూవీ ఎలా ఉందంటే

ఫైనల్‌గా మూవీ ఎలా ఉందంటే


తాజా సమాచారం ప్రకారం.. తమిళ బాహుబలిగా వచ్చిన 'పొన్నియన్ సెల్వన్' మూవీ పూర్తిగా పిరియాడిక్ యాక్షన్ ప్యాక్‌గా తెరకెక్కించారని తెలుస్తోంది. ఇందులో నటీనటులంతా చక్కగా నటించారని చెబుతున్నారు. అయితే, అక్కడక్కడా దర్శకత్వ లోపం కనిపిస్తుందట. కానీ, కొత్త అనుభూతి కోసం ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడొచ్చని వీక్షకులు కామెంట్ చేస్తున్నారు.

అసలైందే మిస్ అయినా కూడా

అసలైందే మిస్ అయినా కూడా

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'పొన్నియన్ సెల్వన్' మూవీ చూసిన వాళ్లంతా ఓ షాకింగ్ న్యూస్ చెబుతున్నారు. ఈ మూవీలో విజువల్స్ క్వాలిటీ చాలా దారుణంగా ఉందట. పిరియాడిక్ అండ్ యాక్షన్ చిత్రాలకు ప్రాణం అయిన అలాంటిది లోపం కావడం సినిమాకు పెద్ద మైనస్‌గా మారిందట. అయితే, అది అక్కడక్కడ మాత్రమే అనిపిస్తుందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X