పొట్టి గౌనులో.. రాధ కూతురు హాట్‌గా (‘కడలి’ ఫంక్షన్ ఫోటోస్)
హైదరాబాద్: చాలా కాలం తర్వాత దర్శకుడు మణిరత్నం 'కడలి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ద్వారా మాజీ హీరోయిన్ రాధ రెండో కూతురు తులసి, మాజీ హీరో కార్తీ కుమారుడు గౌతంకార్తీక్ హీరో హీరోయిన్లుగా వెండి తెరకు పరిచయం అవుతున్నారు. అదే విధంగా అరవింద స్వామి, అర్జున్, మంచు లక్ష్మి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
మద్రాస్ టాకీస్, జెమిని ఫిలిం సర్య్కూట్ బేనర్లపై మణిరత్నం, మనోహర ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అదిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సంగీతానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఇప్పటి వరకు 'కడలి' సినిమాకు సంబంధించి హైదరాబాద్ లో ఎలాంటి వేడుక నిర్వహించలేదు.
ఈ నేపథ్యంలో సినిమా హీరో హీరోయిన్లను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడంలో భాగంగా నోవాటెల్ హోటల్‌లో ఈ రోజు ఫంక్షన్ నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ విడుదల చేసారు. ఈ సందర్భంగా ఏఆర్ రెహ్మాన్ 'మనసే తెరిచావె' పాట పాడుతూ లైఫ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మణిరత్నం, కార్తీక్, అర్జున్, సుహాసిని, ఏఆర్ రెహమాన్, గౌతం కార్తీక్, తులసి, మంచు లక్ష్మి, జెమిని కిరణ్, వనమాలి తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ నోవాటెల్ హెటల్‍లో కడలి మూవీ కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్న యూనిట్ సభ్యులు.

తొడలు కనిపించేలా పొట్టి గౌను వేసుకుని అందరి చూపులు తన వైపుకు తిప్పుకున్న హీరోయిన్ తులసి.

తల్లి రాధతో కలిసి తులసి.

హీరో గౌతం కార్తీక్, హీరోయిన్ తులసిలను పరిచయం చేస్తున్న దర్శకుడు మణిరత్నం.

మంచు లక్ష్మితో హీరోయిన్ తులసి.

రెహ్మాన్ లైవ్ పెర్ఫార్మెన్స్.

కార్యక్రమంలో పాల్గొన్న అర్జున్, సుహాసిని, మంచు లక్ష్మి.
ఈ సందర్బంగా మణిరత్నం మాట్లాడుతూ... సినిమా గురించి తాను ఇప్పుడేమీ మాట్లాడనని, పిబ్రవరి 1న సినిమా చూస్తే మీకే తెలుస్తుంది అని చెప్పుకొచ్చారు. హీరో తండ్రి కార్తీక్ మాట్లాడుతూ...మరణిరత్నం లాంటి గ్రేట్ డైరెక్టర్ ద్వారా తన తనయుడు హీరోగా పరిచయం అవ్వడం ఆనందంగా ఉంది అన్నారు.
రాధ మాట్లాడుతూ... 'నాముగ్గురు పిల్లలను చాలా ఫ్రీడంగా పెంచాను. కార్తీక చాలా ఫార్మాలిటీగా ఉంటుంది. అలా అని తులసి లేజీ పిల్ల కాదు. తను చేయాలనుకుంది చేస్తుంది. మణిరత్నం సినిమాలో తులసికి అవకాశం రావడంతో షాకయ్యాను. సినిమా ఫస్ట్ లుక్ లో తులసి ఎంతో అందంగా కనిపించింది. తల్లిగా గర్వంగా ఫీలవుతున్నాను' అని వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











