twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మణిరత్నం చెలియా ఆడియో లాంచ్‌ లో ‘బాహుబలి’ ప్రస్తావన, రహమాన్ కు రిక్వెస్ట్

    కార్తి హీరోగా మణిరత్నం దర్శకత్వంలో నటించిన ‘చెలియా’ చిత్రం ఆడియో విడుదలైంది.

    By Srikanya
    |

    హైదరాబాద్ : ఓకే బంగారం లాంటి బ్లాక్‌బ‌స్టర్ త‌ర్వాత మ‌ణిర‌త్నం ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న ఓ క్రేజీ చిత్రాన్ని చెలియా టైటిల్‌తో తెలుగులో రిలీజ్ చేయ‌నున్న సంగతి తెలిసిందే. మ‌ద్రాస్ టాకీస్ ప‌తాకంపై తమిళంలో కాట్రు వెలియాదై టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని చెలియా టైటిల్‌తో తెలుగులో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ ప‌తాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు.

    కార్తీ, అతిధిరావ్ హైదారీ జంట‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ ఇదివ‌ర‌కే రిలీజైంది. పోస్టర్ చూడ‌గానే ఇదో చ‌క్కని ల‌వ్‌స్టోరి అని అర్థమైంది. ఏ.ఆర్‌.రెహ‌మాన్‌, శ్రీ‌క‌ర్‌ప్రసాద్ లాంటి టాప్ టెక్నీషియ‌న్స్ ఈ సినిమా కోసం ప‌నిచేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో విడుదలైంది. పాటలు చాలా బాగున్నాయని ఇనానమస్ టాక్ నడుస్తోంది. ఇక ఈ ఆడియో పంక్షన్ లో ఎవరెలా ఈ సినిమా గురించి మాట్లాడారు అనే విషయాలు ఇక్కడ చూద్దాం.

    రహమాన్ అందుకున్నారు

    రహమాన్ అందుకున్నారు

    ఈ సినిమా పాట‌ల విడుద‌ల కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో మ‌ణిర‌త్నం, ఎ.ఆర్‌.రెహ‌మాన్‌, సీతారామ‌శాస్త్రి, వంశీపైడిప‌ల్లి, సుహాసిని, కార్తీ, అదితిరావ్ హైద‌రీ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఆడియో సీడీల‌ను సీతారామ‌శాస్త్రి విడుద‌ల చేసి తొలి సీడీని ఎ.ఆర్‌.రెహ‌మాన్‌కు అంద‌జేశారు.

    కార్తీ ఇందులో కనిపించడు

    కార్తీ ఇందులో కనిపించడు

    మ‌ణిర‌త్నం మాట్లాడుతూ - ``చెలియా సినిమాను ఏర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కించాను. రెగ్యుల‌ర్‌గా క‌న‌ప‌డే కార్తీ ఇందులో క‌న‌పించడు. అలాగే అంద‌మైన అదితిరావ్ హైద‌రీ జంట‌గా నటించారు. ఈ సినిమా మ్యూజిక్‌ తెలుగులో ఇంత బాగా రావ‌డానికి ముఖ్య కార‌ణం ఎ.ఆర్‌.రెహ‌మాన్‌గారు, సీతారామ‌శాస్త్రిగారు. ఇద్ద‌రికీ స్పెష‌ల్ థాంక్స్‌.

    ప్రగాఢ సానుభూతి..

    ప్రగాఢ సానుభూతి..

    దిల్‌రాజుగారి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆయ‌న‌కు, ఆయ‌న కుటుంబానికి మా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాం. ఈ సినిమాను దిల్‌రాజుగారు ఆయ‌న బ్యాన‌ర్‌లో రిలీజ్ చేస్తుండ‌టం మాకెంతో న‌మ్మ‌కాన్ని క‌లిగిస్తుంది. అంద‌రి స‌పోర్ట్ ఉంటుంద‌ని భావిస్తున్నాం`` అన్నారు మణిరత్నం.

    నా తెలుగు టీచర్

    నా తెలుగు టీచర్

    ‘‘హైదరాబాద్‌కు వచ్చిన ప్రతిసారీ తెలుగులో మాట్లాడాలని అనుకుంటా. అది జరగదు. అందుకే ఈ సారి నా తెలుగు టీచర్‌, నా భార్యామణి, మణి భార్య.. సుహాసినిని తీసుకొచ్చాను. ఎయిర్‌ఫోర్స్‌ బ్యాక్‌డ్రాప్‌, అస్వాభావికమైన కార్తీ, అందమైన అదితితో మీ కోసం ‘చెలియా'ను తీశాను. ఈ సినిమాకు రెండు బలమైన స్తంభాలు.. ఎ.ఆర్‌. రెహమాన్, సీతారామశాస్త్రి. మా సినిమా, మా సంగీతం దిల్‌ రాజు చేతిలో భద్రంగా ఉంది'' అని మణిరత్నం చెప్పారు.

    ఎందుకు తీసారో

    ఎందుకు తీసారో

    సుహాసిని మాట్లాడుతూ - ``మ‌ణిర‌త్నంగారి సినిమాల‌కు నేనే బెస్ట్ క్రిటిక్‌ను. నీకు రాయ‌డం వ‌చ్చా అని విమ‌ర్శిస్తూ ఉంటాను. నేను విమ‌ర్శించినా ప్రేక్ష‌కులు ఆయన సినిమాల‌ను ఆద‌రిస్తుంటారు. మ‌రోసారి మ‌ణిర‌త్నంగారు ల‌వ్‌స్టోరీనే డైరెక్ట్ చేశారు. ప్రేమ క‌థ‌నే ఎందుకు తీశారో నాకు తెలియ‌డం లేదు అన్నారు.

    అంత అందంగా నటించే..

    అంత అందంగా నటించే..

    సాధార‌ణంగా మ‌ణిర‌త్నంగారు ఆయ‌న సినిమాల్లో క్యారెక్ట‌ర్స్‌ను డామినేట్ చేస్తుంటారు. కానీ ఈ సినిమాలో కార్తీ, అదితిరావు మ‌ణిర‌త్నంగారిని డామినేట్ చేసేశారు. మ‌ణిరత్నంగారు పెట్టిన ప‌రీక్ష‌ల‌న్నీ వారు పాస్ అయ్యారు. అదితి చాలా చ‌క్క‌గా న‌టించింది. నా ఇన్నేళ్ళ ఎక్స్‌పీరియెన్స్‌లో అదితి అంత అందంగా న‌టించే హీరోయిన్‌ను చూడ‌లేదు. ఇక దిల్‌రాజుగారికి మా సానుభూతిని తెలియ‌జేస్తున్నాం. ఆయ‌న‌కు ఆ దేవుడు శ‌క్తినివ్వాల‌ని కోరుకుంటున్నాం. ఆయ‌న ఈ సినిమాను విడుద‌ల చేస్తుండ‌టం మాకెంతో భ‌రోసానిస్తుంది`` అన్నారు సుహాసిని.

    25 యేళ్ల జర్ని

    25 యేళ్ల జర్ని

    ఆస్కార విజేత, ప్రఖ్యాత సంగీతకారుడు ఎ.ఆర్‌.రెహ‌మాన్ మాట్లాడుతూ - ``మ‌ణిరత్నంగారు నా బ్ర‌ద‌ర్‌, స్నేహితుడు. మా ఇద్ద‌రిదీ 25 యేళ్ళ జ‌ర్నీ. తెలుగు పాట‌లంటే నాకు చాలా ఇష్టం. భాష‌లోని గొప్ప‌త‌న‌మే అందుకు కార‌ణ‌మేమోన‌నిపిస్తుంది. ఇక బాహుబ‌లితో తెలుగు సినిమా స్థాయి ప్ర‌పంచస్థాయికి చేరుకుంది`` అన్నారు.

    గర్వంగా ఫీలవుతున్నా

    గర్వంగా ఫీలవుతున్నా

    ‘‘నేను తమిళంలో చేసిన దాదాపు ప్రతి సినిమా తెలుగులో అనువాద రూపంలో వచ్చింది. ప్రతిసారీ తమిళంలో కంటే తెలుగులో పాటలు బాగా ఉన్నాయనే పేరు వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా పాటలను సీతారామశాస్త్రి గారు రాసిన విధానం కూడా అలాగే ఉంది. ‘బాహుబలి' లాంటి సినిమాలతో ఇవాళ తెలుగు సినిమా ఎదిగిన విధానం చూసి గర్వంగా ఫీలవుతున్నా. ఏడాదికి నాలుగు ‘బాహుబలి' లాంటి సినిమాలు రావాలని కోరుకుంటున్నా. మణిరత్నం నాకు సోదరుడు, మార్గదర్శకుడు, స్ఫూర్తిప్రదాత'' అన్నారు ఎ.ఆర్‌. రెహమాన్.

    యాక్టింగ్ గురించి అదే స్కూల్ లో

    యాక్టింగ్ గురించి అదే స్కూల్ లో

    కార్తీ మాట్లాడుతూ - ``చెలియా నాకు స్పెష‌ల్ మూవీ. ఎందుకంటే నేను ఏ స్కూల్‌లో అయితే సినిమా గురించి తెలుసుకున్నానో అదే స్కూల్‌లో యాక్టింగ్ గురించి తెలుసుకున్నాను. నాకు ఛాలెంజింగ్ క్యారెక్ట‌ర్‌. అన్న‌య్య సూర్య లాంటివాడు చేయాల్సిన క్యారెక్ట‌ర్ అని కూడా మ‌ణిరత్నంగారికి చెప్పాను.

    డిఫరెంట్ జర్ని

    డిఫరెంట్ జర్ని

    ఫైట‌ర్ ఫైలైట్ క్యారెక్ట‌ర్ అని చ‌దివి తెలుసుకున్నాను. కానీ నాకు ముందుగా పెద్ద‌గా అర్థం కాలేదు. ఎప్పుడైతే నేను ఫైట‌ర్ పైల‌ట్ ట్ర‌యినింగ్ క్లాసుల‌కు వెళ్ళానో అప్పుడు క్యారెక్ట‌ర్ గురించి నాకు అర్థమైంది. ఫైట‌ర్ పైల‌ట్స్ ఎంత గొప్ప‌వారో నాకు తెలిసింది. ఈ సినిమాలో న‌టించ‌డం డిఫ‌రెంట్ జ‌ర్నీ అన్నారు కార్తి.

     ఓ ఎనర్జీ వస్తుంది

    ఓ ఎనర్జీ వస్తుంది

    విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో నా మొద‌టి సినిమా చేసిన‌ప్పుడు నేను పీల‌య్యానో, ఈ సినిమా చేసిన‌ప్పుడు అలాగే ఫీల‌య్యాను. రెండు స్ట్రాంగ్ క్యారెక్ట‌ర్స్ మ‌ధ్య జ‌రిగే క‌థ‌. నాలాగే ఆడియెన్స్‌కు కూడా గుర్తుండిపోయే సినిమా అవుతుంది. రెహ‌మాన్‌గారి మ్యూజిక్ విన్న‌ప్పుడ‌ల్లా ఓ ఎన‌ర్జి వ‌స్తుంటుంది. ఆ మ్యూజిక్‌లో నేను యాక్ట్ చేయ‌డం హ్య‌పీగా ఉంది. మ‌ణిర‌త్నంగారి స్ట‌యిల్లో ఉండే ఇన్‌టెన్స్ ల‌వ్‌స్టోరీ. ఏప్రిల్ 7న విడుద‌ల కానుంది`` అన్నారు కార్తి.

    కల నెరింది

    కల నెరింది

    అదితి మాట్లాడుతూ - ``నా స్వ‌స్థ‌ల‌మైన హైద‌రాబాద్‌కు రావ‌డం ఎంతో సంతోషానిస్తుంది. చెలియా నా తొలి తెలుగు సినిమా. మ‌ణిర‌త్నంగారు, ఎ.ఆర్‌.రెహ‌మాన్‌గారితో వ‌ర్క్ చేయ‌డం మ‌ర‌చిపోలేని అనుభూతి. ఇది నాకొక స్పెష‌ల్ మూవీ. క‌ల నేర‌వేరిన‌ట్టుగా అనిపిస్తుంది. కార్తీ నా ఫేవ‌రెట్ కో స్టార్‌. స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌`` అన్నారు.

    రహమాన్ కు రిక్వెస్ట్

    రహమాన్ కు రిక్వెస్ట్

    సీతారామశాస్త్రి మాట్లాడుతూ ‘‘ఈ చిత్రానికి పాటలు రాయడంలో మణిరత్నంగారు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. రెహమాన్ కేవలం మ్యూజిక్‌ డైరెక్టర్‌. దానికంటే ఇంకో స్థాయిపైన ఉండే వ్యక్తి. నేను తమిళ పాటల్ని అనువదించలేదు. అనుసృజన చేశాను. ఇందులో ‘మంచు ఆమని' అనే పద బంధం ఉపయోగించాను. నాకు ఏడాదికో పాటనైనా ఇవ్వమని రెహమాన్ ను రిక్వెస్ట్‌ చేస్తున్నా'' అన్నారు

    English summary
    Telugu movie Cheliyaa audio launch event held in Hyderabad. Celebs like Karthi, Aditi Rao Hydari, AR Rahman, Mani Ratnam, Suhasini Maniratnam and others graced the event.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X