'ఓకే బంగారం' పాటల విడుదల వేడుక... (ఫొటోలు,వీడియో)
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం' ఓకే బంగారం'. ప్రముఖ మళయాళ నటుడు మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ ఈ చిత్రం ద్వారా హీరోగా గా పరిచయమవుతున్నారు.
మద్రాస్ టాకీస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు అందిస్తున్నారు. ఈ సందర్భంగా మణిరత్నం, నాని, ఎఆర్.రహమాన్ ఏమన్నారో..ఈ క్రింద వీడియోలో చూడండి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
నిత్యామీనన్ హీరోయిన్. ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూర్చిన ఈ సినిమా పాటల విడుదల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నాని, సాయిధరమ్‌తేజ్, నిఖిల్, సిరివెన్నెల సీతారామశాస్త్రి, వివి వినాయక్, పైడిపల్లి వంశీ, సిద్దార్ధ వర్మ , నిర్మాత దిల్‌రాజు పాల్గొన్నారు.

వంశీ పైడిపల్లి మాట్లాడుతూ....
తమిళంలో లేని మన మన మెంటర్ మదిలో అని గురువు గారు మార్చి అద్బుతంగా చేసి పాటలు రూపొందించారు. చాలా గ్రేట్ అన్నారు.

నాని మాట్లాడుతూ...
సినిమాకు డబ్బింగ్ చెప్తున్నంత సేపూ ఓ వైపు నుంచి ఇలాంటి అవకాసం వచ్చినందుకు సంతోషం, మరోవైపు భయంకరమైన జెలసీ..ఈ సినిమాలో హీరోగా నేను ఎందుకు చేయలేకపోయానా అని ...నమ్మిన మణిసార్ కు ధాంక్స్ అంటూ చెప్పుకొచ్చారు.

సీతారామ శాస్త్రి గారు మాట్లాడుతూ...
నాని చెప్పిన మాటలు చెప్పిన నిజం..సినిమా ఒక మ్యాజిక్, మెస్మిరిజం. మణిరత్నం గారికి అబిమానులు కాని తెలుగు వారు ఉండరు. ఇక ఎఆర్ రహమాన్ గారికి అభిమాని కానీ ప్రపంచంలో ఎవరూ ఉండరు అంటూ చెప్పుకొచ్చారు.

సాయిధరమ్ తేజ
ఇలాంటి గొప్ప వ్యక్తులు చేస్తున్న సినిమా సాంగ్స్ లాంచింగ్ లో పాల్గొన్నందుకు చాలా ఆనందపడుతున్నాను. సీతారామశాస్త్రి గారు రాసిన పాటకే నేను ఈ రోజు నేను మీ ముందుకు వస్తున్నాను.

నిఖిల్ మాట్లాడుతూ...
మెంటర్ మదిలో సాంగ్ చాలా ఎమోజింగ్ సాంగ్. ఎప్పుడూ నా మైండ్ లో మోగుతూ ఉంటుంది. తెలుగు జనాలకు దిల్ రాజు గారు ఈ సినిమా చూపించబోతున్నారు చాలా ధాంక్స్ సార్.

దిల్ రాజు మాట్లాడుతూ...
ఈ ఆడియో నా చేతికి వచ్చి వారం అయ్యింది. అప్పటి నుంచి నా మైండ్ లో ఏదో తీయని అనుభూతి. శాస్త్రిగారు కోరికపై ఈవినింగ్ ఈ పంక్షన్ పెట్టి, ఆత్మీయులందరినీ పిలిచి ఈ పంక్షన్ అన్నారు. మణిరత్నం గారి... సఖి సినిమా నైజాం డిస్ట్రిబ్యూట్ చేసారు. అమృత సినిమా ..మా బ్యానర్ లో నిర్మించాను.అది ఫెయిల్యూర్ అయితే వినాయిక్ గారు నన్ను నిలబెట్టారు. అప్పటి నుంచి మణిరత్నం గారి సినిమా సక్సెస్ ఫుల్ ఎప్పుడు అవుతుందా అని చూస్తున్నాను. కథ తెలుసుకుని నేను సినిమా తెలుగుకి తీసుకున్నాను.

వివి వినాయిక్ మాట్లాడుతూ....
దిల్ రాజు గారు తీసుకున్నారంటే హిట్ క్రిందే లెక్క. మణరత్నం గారు తీసిన సినిమా అంటే మా అందరికీ ఇష్టం. మాలాంటి దర్శకులందరి సక్సెస్ లో మణిగారికి భాగం ఉంటుంది. ఈ ఆడియో నే కాదు సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అన్నారు.

అప్పటి నుంచీ...
'అలా మొదలైంది' మూవీతో తెలుగు కుర్రకారు గుండెల్లోకి సూటిగా దూసుకుపోయింది నిత్యామీనన్. తెలుగులో నటించిన సినిమాలు తక్కువే అయినా... అమ్మడి పరభాషా చిత్రాలు తెలుగువారి ముందుకు వచ్చి బాగానే పాపులారిటీ సంపాదించుకుంది.

అంతేకాదు...
నిన్న కాక మొన్న వచ్చిన 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు' చిత్రంలో నిత్యామీనన్ ముస్లిం అమ్మాయి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. తెలుగులో ఇంతవరకూ వచ్చిన అన్ని సినిమాల్లోనూ కుదురైన పాత్రలు పోషించింది తప్పితే... ఎక్కడా హద్దులు మీరింది లేదు.

ఆశ్చర్యపోతున్నారు
అలాంటి నిత్యామీనన్ తాజా చిత్రం 'ఓకే బంగారం' లోని విజువల్స్ చూసి జనం ఆశ్చర్యపోతున్నారు

అదే కథ
సహజీవనం చేసే ఓ అబ్బాయి-అమ్మాయికి సంబంధించిన కథ కాబట్టి... ఇందులో ఈ యువ జంట మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది

రిలీజ్ ఎప్పుడు
తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఏప్రిల్ 17న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పి.సి శ్రీరామ్ పనిచేస్తున్నారు. దాదాపు దశాబ్దం తర్వాత మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చిత్రానికి శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్ సఖి ఆఖరి చిత్రం. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్.రెహ్మాన్.


Click it and Unblock the Notifications











