మణిరత్నం వంటి భావోద్వేగాలను అధ్బుతంగా తెరపై నింపే దర్శకుల డైరక్షన్ లో చేయాలని ప్రతీ నటుడు కీ ఆశ ఉంటుంది. కొంతమందికి అది తొందరగా తీరుతుంది. మరి కొందరికి జీవిత కాలం లేటవుతుంది. అయితే ప్రస్తుతం రణవీర్ కపూర్ ...మణిరత్నం దర్శకత్వంలో చేసే ఛాన్స్ సంపాదించాడని తెలుస్తోంది.'సావరియాఁ' చిత్రంతో కథానాయకుడిగా తెరంగేట్రం చేసిన నటుడు రణ్‌బీర్ కపూర్. ఆ చిత్రం బాక్సాఫీసు దగ్గర సందడి చేయకపోయినా అతనికి అవకాశాలకు మాత్రం కొదువ లేకుండా ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు, దర్శకులు అతనితో సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పటికే యశ్‌రాజ్ ఫిలిమ్స్ సంస్థ 'బచ్‌నా యే హసీనోఁ' చిత్రాన్ని రణ్‌బీర్‌తో నిర్మించింది. ఇదీ అంతగా ఆడలేదు. ఓ మూడు చిత్రాలు ఒప్పేసుకొని బిజీ బిజీగా ఉన్నాడు రణబీర్. ఇతనితో చిత్రం రూపొందించేందుకు మణిరత్నం కూడా సుముఖత వ్యక్తం చేశారు. అయితే అభిషేక్, ఐశ్వర్య నటిస్తున్న రావణ్ చిత్రం తరవాతే ఇది ఉంటుందని తెలుస్తోంది. అంటే కెరీర్ ప్రారంభంలోనే ఈ అవకాశం రావటం భలే లక్కీ కదా అని అందరూ అంటున్నారు.