ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు గుండెపోటు
ఢిల్లీ : ప్రముఖ సినీ దర్శకుడు మణిరత్నంకు నిన్న రాత్రి ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. మొదట చెస్ట్ పెయిన్ గా ఉందన్నారు..వెంటనే..ఆయన్ను డిల్లీలోని అపోలో హాస్పటిల్ కు తీసుకు వెల్లారు. డాక్టర్లు ఇంతకు మించి చెప్పటానికి ఇష్టపడటం లేదు.
భార్య సుహాసిని ఆయన వెంట ఉన్నారు. గతంలో (2009) కూడా ఒక్కసారి మణిరత్నంకు గుండెపోటు వచ్చింది. ఆయన తీసిన పలు సినిమాలు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఘన విజయం సాధించాయి. రోజా, బొంబాయి వంటి సినిమాలు ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి.



Click it and Unblock the Notifications











