'విలన్' టైటిల్ వేటూరి సూచించిందే: మణిరత్నం
'గీతాంజలి' నుంచి వేటూరితో నాకు అనుబంధం ఏర్పడింది. అప్పట్నించీ నా సినిమాల తెలుగు వెర్షన్లన్నింటికీ ఆయన పాటలు రాశారు.'విలన్' టైటిల్ ఆయన సూచించిందే. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు అని మణిరత్నం అన్నారు. ఆయన తాజా చిత్రం రావణ్(విలన్) ప్రమోషన్ నిమిత్తం ఆయన నిన్న హైదరాబాద్ వచ్చారు. హోటల్ తాజ్ కృష్ణాలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మణిరత్నం, సుహాసిని, ఐశ్వర్యారాయ్, విక్రమ్, ప్రియమణి పాల్గొన్నారు. ఈ సమావేశంలో మణిరత్నం ఇటీవల స్వర్గస్తులైన ప్రసిద్ధ గేయ రచయిత వేటూరిని స్మరించుకున్నారు.
ఇక ఈ చిత్రం గురించి మణిరత్నం చెబుతూ..ఈ చిత్రానికి సంబంధించిన ప్రధాన కథాంశం ఐశ్వర్యరాయ్ చుట్టూ తిరుగుతుంది. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు తన పాత్రే మొత్తం కథను క్యారీ చేస్తుంది. పది తలల వ్యక్తిని ఊహించుకుంటే గమ్మత్తుగా ఉంటుంది. ఎప్పుడో పదివేల సంవత్సరాల క్రితం సృష్టించిన ఆ పాత్రను ఆదర్శంగా తీసుకుని ఈ సినిమా తీయడం జరిగింది. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారం లభించి ఉండకపోతే ఈ సినిమా నేను బాగా చేయడానికి వీలు పడేది కాదు' అన్నారు. ఇక ఈ చిత్రం ఈ నెల(జూన్) 18న రిలీజ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











