మణిశర్మ-తమన్....ఆల్ ఈజ్ వెల్లా?

By Bojja Kumar

మణిశర్మ, థమన్ మధ్య గత కొన్ని రోజులుగా మాటలు లేవని సినీ వర్గాల్లో వినిపిస్తున్న మాట. అయితే అదంతా వట్టి పుకారే...ఇద్దరూ ఆల్ ఈజ్ వెల్ అనేది తాజాగా తేలిన నిజం. ఇటీవల మాటీవీ నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో మణి శర్మ చిరు నవ్వుతో తన చేతుల మీదుగా శిష్యుడు తమన్ కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు అంద జేయడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు.

తమన్ మ్యూజిక్ డైరెక్టర్ కాక ముందు మణిశర్మ తగ్గరే శిష్యరికం చేశాడు. కీబోర్డ్ ప్లేయర్‌గా చాలా సంవత్సరాలు పని చేశాడు. మణి శర్మతో వేరుపడి సొంతగా మ్యూజిక్ డైరెక్షన్ మొదలు పెట్టిన తమన్ గురువుకు వచ్చే అవకాశాలు తనవైపు లాగేసుకుంటున్నాడని, దీనిపై మణి శర్మ కోపంగా ఉన్నాడని వదంతులు రేగాయి. వీటిని ఎవరూ ఖండించక పోవడంతో అంతా నిజమే అని అనుకున్నారు.

ఇటీవల విడుదలైన దూకుడు, బిజినెస్ మేన్, బాడీగార్డ్ సినిమాలకు తమన్ అందించిన సంగీతం మంచి విజయం సాధించింది. త్వరలో విడుదల కాబోతున్న రవితేజ నిప్పు, ప్రభాస్ రెబల్, సిద్దార్థ లవ్ ఫోయిల్యూర్ సినిమాలకు కూడా థమన్ సంగీతం అందించారు. మణి శర్మ చేతిలో మాత్రం ఈ సంవత్సం కేవలం 'రచ్చ' సినిమా మాత్రమే ఉంది. ఒకప్పుడు ఖాళీ సమయం దొరకనంత బిజీగా ఉండే మణి శర్మ...తమన్ పుణ్యమా అని పని లేకకుండా అయ్యాడనే వాదన కూడా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X