పవర్ స్టార్ సినిమా- దేవిశ్రీ ఔట్, మణిశర్మ ఇన్!

By Bojja Kumar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రేజీ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందబోతోన్న 'కెమెరామెన్ గంగతో రాంబాబు' చిత్రానికి సంగీత దర్శకుడు ఖరారయ్యాడు. తొలుత ఈచిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ను తీసుకోవాలని దర్శక నిర్మాతలు భావించినప్పటికీ చివరి నిమిషయంలో ఈ అవకాశం మెలోడి బ్రహ్మ మణి శర్మకు దక్కింది.

యువ సంగీత దర్శకుల ధాటికి అవకాశాలు తగ్గి పోయిన మణిశర్మ....ఇటీవల రచ్చ చిత్రానికి మాంచి మాస్ బీట్లు ఇచ్చి సక్సెస్ సాధించాడు. ఈ నేపథ్యంలో ఆయన పవర్ స్టార్ సినిమాకు వాయించే అవకాశం దక్కించుకోవడం చూస్తుంటే మణి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడని స్పష్టం అవుతోంది.

ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ న్యూస్ ఛానల్ రిపోర్టర్‌గా కనిపించనున్నాడు. ప్రతి రంగంలోనూ మంచి వారు, చెడ్డ వారు ఉన్నట్లే మీడియా రంగంలోనూ అక్రమార్కులు, చీడ పురుగులు ఉన్నారు. ఈ చిత్రంలో మీడియాలోని చీడ పరుగులపై సెటర్లు ఉంటాయని, విలువలు దిగజార్చి మీడియాను డబ్బు సంపాదించడానికి, అక్రమార్జనకు వాడుకుంటున్న వారిని ఎండగట్టే విధంగా డైలాగులు ఉంటాయని అంటున్నారు.

పవన్ కళ్యాణ్, తమన్నా, ప్రకాశ్‌ రాజ్, బ్రహ్మానందం, ఆలీ, ఎం.ఎస్.నారాయణ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: మణిశర్మ, సినిమాటో గ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ప్రొడక్షన్ డిజైనర్: చిన్నా, ఎడిటింగ్: శేఖర్, ఫైట్స్: విజయ్, నిర్మాత: డివివి దానయ్య, సమర్పణ: సూర్యదేవర రాధాకృష్ణ, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X