twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తప్పు చేశా...నష్టం అనుభవిస్తున్నా

    By Srikanya
    |

    హైదరాబాద్ : సినిమాలు తీసి బాగుపడ్డవాడు ఎవడూ లేడని తెలిసి కూడా నేను ఆ తప్పు చేశాను. చాలా నష్టం అనుభవిస్తున్నాను. 'ముంబై 125 కి.మీ' త్రీడీ హారర్‌ సినిమా హిందీలో నిర్మించాను. చేతులు కాలాయి. పట్టుకోవడానికి ఆకులు కూడా లేవు అన్నారు అంటూ బాధపడ్డారు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ.

    తనపై వచ్చిన భూమి వివాదం గురించి మాట్లాడుతూ...మ్యూజిక్‌ స్కూల్‌ ప్రారంభిద్దామనే ఓ ప్లేస్‌ తీసుకున్నా. చెన్నైలోని ఈసీఆర్‌లో. స్కూలు, బోర్డింగ్‌ వసతులు కల్పిస్తూ స్కూలును ఏర్పాటు చేద్దామనుకున్నా. మునులు తపస్సు చేస్తే అడ్డంకులు సృష్టించే రాక్షసులు ఎప్పుడూ ఉంటారని మనం చదివాం. నేను ఈసీఆర్‌లో తీసుకున్న స్థలం విషయంలోనూ అదే జరిగింది. డాక్యుమెంట్‌లో నాకు అమ్మిన వారు చిన్న తప్పు చేశారు. అది తెలుసుకుని ఒక వ్యక్తి నాపై కేసు పెట్టాడు. ఇప్పుడు ఆ కేసు సివిల్‌ కోర్టులో ఉంది. నేను 2002లో స్థలం కొంటే 2010లో అతను మీద పడ్డాడు అన్నారు.

    Mani Sharma loss as a producer

    అలాగే... మా నాన్నగారు వేదం నేర్చుకున్నారు. మ్యూజిక్‌ ఫ్యామిలీలో పుట్టాను. నేను మోసం ఎందుకు చేస్తాను? నాకు రికార్డింగ్‌ రూమ్‌, ఎయిర్‌పోర్టు తప్ప ఇంకేమీ తెలియదు. నేను ఎంతో పోగొట్టుకున్నాను గానీ, ఇతరులది తీసుకోవడం ఎప్పుడూ లేదు. మణిశర్మ ల్యాండ్‌ గొడవ అని వార్తలను రాసేవారు కనీసం నా అభిప్రాయం తీసుకోవాలి కదా. నేను ఇప్పటిదాకా ప్రభుత్వం దగ్గర ల్యాండ్‌ కూడా తీసుకోలేదు. మా రికార్డింగ్‌ థియేటర్‌ను కూడా వడ్డీకి డబ్బులు తెచ్చుకుని నేనే కట్టుకున్నాను. ఏ ప్రభుత్వం నాకు సెంటు భూమిని ఇవ్వలేదు అని చెప్పుకొచ్చారు.

    ఇక ఇళయరాజా గారు ఒక వైపు పెద్ద సినిమాలు చేసేవారు. మరో వైపు కామెడీ సినిమాలు చేసేవారు. గోపీచంద్‌ 'యజ్ఞం' సినిమాకు నేనే సంగీతం చేశాను. నా కెరీర్‌ మొత్తం మీద అంత తక్కువ ఎమౌంట్‌ని నేనెప్పుడూ తీసుకోలేదు. చిరంజీవిగారు, మహేష్‌బాబు సినిమాలకు సంగీతం చేసినప్పుడే ఈ సినిమా కూడా చేశాను. ఎందుకు చేశానంటే కారణాలున్నాయి..

    కొంతమంది దర్శకులుగానీ, నిర్మాతలు గానీ తొలిసారి సినిమాలు చేసేటప్పుడు 'అన్నగారూ... మీరు చేయాలి. మీరు చేస్తే నాకు లైఫ్‌ వస్తుంది' అని అనేవారు. వెంటనే చేసేవాడిని. అప్పుడు వారు చాలా ఆనందించేవారు. వాళ్ల సంతోషంలో నేను ఆనందాన్నివెతుక్కునేవాడిని. ఎందుకంటే... ఎంత సంపాదించి ఏం లాభం? ఎంత తింటాం? డబ్బు అనేది ఆల్వేస్‌ హ్యాపీనెస్‌ కాదు. బతకడానికి కావాలనుకోండి. కానీ మా లాంటి మ్యుజిషియన్స్‌కి, సెన్సిటివ్‌ మ్యుజిషియన్స్‌కి అదే ఆనందం. డైరక్టర్‌ వచ్చి సన్నివేశాలు చెప్పగానే హార్మోనియం ముందు కూర్చుని బాణీలు కడతాను అన్నారు.

    English summary
    Mani Sharma said that he is very much loss with ‘Mumbai 125 KM’ Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X