ప్రముఖ సంగీత దర్శకుడు ఇప్పుడు నిర్మాతగా మారుతున్నారు.ఆయన దిల్ రాజు బ్యానర్ లో భాస్కర్ ,సుకుమార్ ల వద్ద పని చేసివచ్చిన చైతన్య అనే నూతన దర్శకుడు తో సినిమా ప్రారంభించనున్నాడు.త్వరలో షూటింగ్ కి వెళ్ళనున్న ఈ చిత్రంలో హీరోగా హ్యాపీడేస్ ఫేమ్ నికిల్ చేయనున్నాడు.ఇక సినిమాకు సంగీతం ఆయనే అందిస్తాడు. అలాగే మరో సంగీత దర్శకుడు రమణ గోగుల నిర్మాతగా సుమంత్ హీరోగా సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.మరి ఇంకెంత మంది సంగీత దర్శకులు నిర్మాతలుగా అవతారాలు ఎత్తనున్నారో.ఇక కొత్తగా కథలు పట్టుకు తిరిగేవారు సంగీత దర్శకులపై కూడా ఓ కన్నేసి ఉంచితే మేలు.