రక్త చరిత్రకు సంగీతం ఎవరంటే
రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్న రక్త చరిత్ర చిత్రానికి సంగీతం మణిశర్మ అందించనున్నారు. దాంతో మణిశర్మ హిందీలో తొలిసారిగా అడుగుపెట్టినట్లు అవుతుంది.ఇక వర్మ ఈ చిత్రాన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దివంగత పరిటాల రవి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రధాన పాత్రలయిన పరిటాల రవి,మద్దెల సూరి పాత్రల కోసం చాలా మందిని పరిశీలించి వివేక్ ఒబరాయ్ ని పరిటాల రవి పాత్రకు, సూర్య ను సూరి పాత్రకు ఎంపికచేసారు. ఇక ఈ చిత్రం మూడు బాషల్లో రిలీజ్ కానుంది. వీటితో పాటు రవిరాజా పినిశెట్టి తనయుడు ప్రదీప్ ఈ చిత్రం తెలుగు వెర్షన్ కి పరిటాల రవి పాత్రకు ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం లేదని ప్రదీప్ ని వేరే ప్రాజెక్టు కోసం తీసుకున్నామని వర్మ వివరణ ఇచ్చారు.
రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర పరిటాల రవి మద్దెల సూరి రవిరాజాపినిశెట్టి ప్రదీప్ సూర్య వివిక్ ఒబరాయ్ మణిశర్మ manisharma raktacharitra music paritalaravi suri surya pradeep vivekobarai


Click it and Unblock the Notifications