twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అది చాలా పెద్ద తప్పు: కంగనా-క్రిష్ జాగర్లమూడి ‘మణికర్ణిక’ గొడవపై పూజా భట్!

    |

    బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక' పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. అయితే ఈ సినిమా విషయంలో కంగనా రనౌత్ పాల్పడిన అన్యాయాలను బయట పెడుతూ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మీడియా ముందుకు రావడం చర్చనీయాంశం అయింది.

    'మణికర్ణిక' మూవీ 70 శాతం తానే చిత్రీకరించానని కంగనా చెప్పుకోవడంపై క్రిష్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటీవల పలు బాలీవుడ్ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కంగనా ఎంత మూర్ఖంగా ప్రవర్తించిందో, తాను మధ్యలో ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో? ఆయన బయటపెట్టారు.

    క్రిష్‌కు మద్దతుగా పూజా భట్

    క్రిష్‌కు మద్దతుగా పూజా భట్

    ‘మణికర్ణిక' వివాదంపై చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు స్పందించడానికి ఇష్టపడటం లేదు. తాజాగా ఈ ఇష్యూపై పూజా భట్ రియాక్ట్ అయ్యారు. ఆమె క్రిష్‌కు మద్దతుగా మాట్లాడే ప్రయత్నం చేయడంతో పాటు పరోక్షంగా కంగనా తీరును తప్పుబట్టారు.

    అలాచేయడం తప్పు, డబ్బు వస్తుంది పోతుంది

    అలాచేయడం తప్పు, డబ్బు వస్తుంది పోతుంది

    ఇలా చేయడం చాలా తప్పు... అది ఏ లెవల్‌లో ఉన్నా సహించరానిది, మనం చేసిన పనికి తగిన గుర్తింపు ఇవ్వాలని పూజా భట్ అన్నారు. డబ్బు వస్తుంది.. పోతుంది, మనం చేసిన పనికి తగిన గుర్తింపు ఇవ్వాలనేది ఫిల్మ్ మేకింగ్‌లో ఫస్ట్ రూల్ అని ఆమె వ్యాఖ్యానించారు.

    తనకు క్రిడిట్ ఇవ్వక పోవడంపై క్రిష్ ఆవేదన

    తనకు క్రిడిట్ ఇవ్వక పోవడంపై క్రిష్ ఆవేదన

    వాస్తవానికి ‘మణికర్ణిక' సినిమా మొత్తాన్ని క్రిష్ తెరకెక్కించినప్పటికీ... కొన్ని మార్పులకు దర్శకుడు క్రిష్‌ను అంగీకరించక పోవడంతో ఆయన్ను తప్పించి కంగనా దర్శకత్వంలో కొంతభాగం రీ షూట్ చేశారు. అయితే కంగనా కేవలం 30 శాతం రీ షూట్ చేసి.... 70 శాతం తానే తీసినట్లు ప్రచారం చేసుకుంటోందని క్రిష్ మండి పడ్డారు.

    చరిత్రను వక్రీకరించడం ఇష్టం లేకనే తప్పుకున్నా

    చరిత్రను వక్రీకరించడం ఇష్టం లేకనే తప్పుకున్నా

    సినిమాలోని సదాశివరావు పాత్ర విషయంలో చరిత్రను వక్రీకరించే విధంగా కంగనా, నిర్మాతలు మార్పులు కోరారని, అలా చేయడం తనకు ఇష్టం లేదని, అందుకే ప్రాజెక్ట్ నుంచి మధ్యలోనే బయటకు వచ్చినట్లు క్రిష్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

    ఆ మాటలతో మరింత హర్ట్ అయిన క్రిష్

    ఆ మాటలతో మరింత హర్ట్ అయిన క్రిష్

    తన పనితీరు నిర్మాతలకు నచ్చలేదని, సినిమా భోజ్‌పురి మూవీలా వచ్చిందని వారు అంటున్నట్లు కంగనా తనను నమ్మించే ప్రయత్నం చేశారని క్రిష్ తెలిపారు. కంగనా ఇలా మాట్లాడటం కూడా క్రిష్‌ను చాలా బాధించినట్లు తెలుస్తోంది.

    English summary
    "This is so wrong... on every level... this is not the industry I was born to and not the industry I wish to inherit. Eventually it is credit we work for... money comes & money goes... the first rule of filmmaking is to acknowledge people’s contribution." Pooja Bhatt backs director Krish on Manikarnika issue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X