హీరోయిన్‌ను అడ్డం పెట్టుకుని సూపర్‌స్టార్ మీద వర్మ సెటైర్లు!
Recommended Video

ఇద్దరు వ్యక్తుల మధ్య విబేధాలు ఉన్నపుడు, ఏదైనా గొడవ జరిగినపుడు మామూలు వ్యక్తులు ఎవరైనా వారి మధ్య విబేధాలు తగ్గించడానికి ప్రయత్నిస్తారు. రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేయరు. అయితే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అందుకు భిన్నం. కావాలని వివాదాలు ఆజ్యం పోయడం లాంటివి చేస్తుంటారు.
తాజాగా రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్లో పెట్టిన ఓ పోస్ట్ హాట్ టాపిక్ అయింది. ఒక స్టార్ హీరోయిన్‌ను అడ్డం పెట్టుకుని మరో స్టార్ హీరో సినిమాపై సెటైర్లు వేసే ప్రయత్నం చేశారు. దీని గురించి సోషల్ మీడియాలో ఆ స్టార్స్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ నడుస్తోంది.
వర్మ చేసిన ట్వీట్ ఇదే...
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ నటిస్తున్న ‘మణికర్ణిక-ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ' చిత్రానికి సంబందించిన ట్రైలర్ పోస్ట్ చేసిన వర్మ.... ఈ మూవీ ‘సూపర్ 3000' రెట్లు ఎక్కువగా కనిపిస్తోందంటూ వ్యాఖ్యలు చేశారు.

ఆ హీరో గురించేనా?
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్, కంగనా రనౌత్ మధ్య ఆ మధ్య గొడవ జరుగడం, విషయం కోర్టు వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హృతిక్ రోషన్ ‘సూపర్ 30' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ‘మణికర్ణిక' సినిమాలాగే ‘సూపర్ 30' కూడా బయోపిక్ కావడం గమనార్హం. ఈ సినిమాను ఉద్దేశించే వర్మ ఈ వ్యాఖ్యలు చేసినట్లు చర్చించుకుంటున్నారు.
వర్మ ఉద్దేశ్యం అర్థమైంది
కంగనా రనౌత్, హృతిక్ రోషన్ మధ్య మళ్లీ వివాదం రాజేసే ప్రయత్నం రామ్ గోపాల్ వర్మ చేస్తున్నాడని,అ తడి ఉద్దేశ్యం తమకు అర్థమైంది అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేశారు.
ఫన్నీ మీమ్స్
రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలకు సపోర్ట్ చేస్తూ కొందరు ఫన్నీ మీమ్స్ ట్వీట్ చేశారు. ఎంతైనా ఆర్జీవి అభిమానులు ఆర్జీవి అభిమానులే.


Click it and Unblock the Notifications











