తమిళ ఇండస్ట్రీలో కరోనా కలకలం.. స్టార్ డైరెక్టర్ కు కరోనా.. హుటాహుటిన హాస్పిటల్ కు తరలింపు!

నెమ్మదిగా కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. నాలుగో దశ అంటూ పలువురు పేర్కొంటున్న నేపథ్యంలో సినీ ప్రముఖులకు కరోనా కేసులు సోకడం ఇప్పుడు సంచలనంగా మారుతుంది. ఇప్పటికే పలువురు సినీ నటులు కరోనా బారిన పడగా ఇప్పుడు ఆ జాబితాలో సినీ దిగ్గజ దర్శకుడు మణిరత్నం కూడా చేరారు. ఆయన తాజాగా కరోనా బారిన పడినట్లు సమాచారం. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

రంగం సిద్ధం

రంగం సిద్ధం

సౌత్ లో మణిరత్నం సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. చాలా సాఫ్ట్ లవ్ స్టోరీలతో ప్రేక్షకులను అలరించి ఆయన ఈ మధ్య కాలంలో సరైన హిట్ కొట్టలేదు. చివరిగా నవాబ్ అనే సినిమాతో ఒక మోస్తరు హిట్టు అందుకున్న మణిరత్నం ఇప్పుడు పోన్నియన్ సెల్వన్ అనే తమిళ నవల ఆధారంగా ఒక భారీ బడ్జెట్, మల్టీస్టారర్ మూవీ నిర్మించారు. ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కరోనా బారిన పడటం టెన్షన్ లేపుతోంది..

వెల్లడించే అవకాశం

వెల్లడించే అవకాశం

తమిళ సంచలన దర్శకుడు మణిరత్నం కరోనా బారిన పడడంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం ఆయన చెన్నైలోనే అపోలో హాస్పిటల్ లో కరోనా కోసం చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే విషయం మీదకు మాత్రం పూర్తి సమాచారం బయటకు వెల్లడి కావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన బాగానే ఉన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన భార్య సీనియర్ నటి సుహాసిని మణిరత్నం ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు వెల్లడించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

చెన్నైలో

చెన్నైలో


సినిమాల విషయానికొస్తే మణిరత్నం ప్రస్తుతానికి పాన్ ఇండియా రేంజ్ లో ఒక భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నారు. తమిళంలో పోన్నియన్ సెల్వన్ అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ తో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్ పై ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాలోని మొదటి భాగం సెప్టెంబర్ 30వ తేదీన గ్రాండ్గా రిలీజ్ అవుతుంది. నిజానికి ఈ సినిమాకి సంబంధించిన టీజర్ లాంచ్ కార్యక్రమం కొద్ది రోజుల క్రితం అంగరంగ వైభవంగా చెన్నైలో జరిగింది.

కరోనా బారిన పడటంతో

కరోనా బారిన పడటంతో

అయితే ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో ఎవరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటించలేదని తెలుస్తోంది. ఈ సినిమాలో కీలకపాత్ర పోషించిన శరత్ కుమార్ కూడా కొన్నాళ్ల క్రితమే కరోనా బారిన పడి మళ్లీ కోలుకున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోగా నటించిన విక్రమ్ కూడా చాతి నొప్పితో బాధపడుతూ హాస్పిటల్ లో చేరడం కలకలం రేపింది. ఇప్పుడు అదే టీంలో మణిరత్నం కూడా కరోనా బారిన పడటంతో ఆయన అభిమానులు అందరూ టెన్షన్ పడుతున్నారు.

హెల్త్ బుల్లెటిన్

హెల్త్ బుల్లెటిన్


అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించి సుహాసిని లేదా అపోలో హాస్పిటల్ యాజమాన్యం అధికారికంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉన్నా దానికి సంబంధించి ఒక హెల్త్ బుల్లెటిన్ అని విడుదల చేయాలని అపోలో హాస్పిటల్ యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. ఈ రోజు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి ఆయన ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన బులెటిన్ విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X