నిజమే :నాగార్జున, మహేష్ కలిసి...

అలాగే తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన ఒకరిద్దరు స్టార్ హీరోలు కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించే అవకాశాలున్నాయని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి మణిరత్నం ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టారని, మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నట్టు తెలిసింది.
ఇక మణి రత్నతో సినిమా చేయాలని మహేష్ కూడా ఆసక్తి కనబరుస్తూ వస్తున్నారు...ఆ మేరకు ఆయన మీడియాతో ఇంతకుముందు చెప్పారు కూడా. అలాగే ఇదివరకు వీరిద్దరి మధ్య చర్చలు కూడా సాగినట్టు తెలుస్తోంది. తెలుగులో మహేష్‌తో, తమిళంలో విజయ్‌తో ఓ సినిమా తీయాలని మణిరత్నం అనుకొన్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దాంతో ఇటీవల మళ్లీ మహేష్‌తో సినిమా తీయాలని మణిరత్నం నిర్ణయించినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











