మహేష్ లాటి స్టార్ అవసరం ఎంతైనా ఉండాలని గ్రహించాడామో..పాపం.!

By Sindhu

మణిరత్నం దర్శకత్వంలో నటించాలని ఉవ్విళ్లూరుతున్న మహేష్ బాబు చేతి దాకా వచ్చిన అవకాశం చేజారిందని విచారం వ్యక్తం చేస్తున్నాడు. మణిరత్నం దర్శకత్వంలో నటించేందుకు ఎదురు చూస్తున్నానంటూ మహేష్ మరోసారి ప్రకటించినా కానీ ఇటీవలే అతనితో తీద్దామని అనుకున్న పీరియడ్ సినిమాని అటకెక్కించేసిన మణిరత్నం ఇప్పట్లో మహేష్ కోరిక తీర్చేలా లేడు. మణిరత్నం సినిమాలో నటించే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతం అన్నట్టుగా పులకించిపోయిన మహేష్ బాబు ఆనందంపై మణి నీళ్లు చల్లేశాడు. తన సినిమాకి సరిపడా డబ్బులు పెట్టే వాళ్లు లేరని, ఆ ప్రాజెక్ట్ ఆపేస్తున్నానని, తనకి కేటాయించిన డేట్లు వేరే వాళ్లకి ఇచ్చేసుకోవచ్చని మణిరత్నం ప్రకటించాడు. దీంతో మహేష్ బాబు చాలా డిజప్పాయింట్ అయ్యాడు.

మణిరత్నం దర్శకత్వంలో నటించే కోరిక త్వరలోనే తీరుతుందని ఆశిస్తున్నానని అన్నాడు. దీంతో మహేష్ కి తనపై ఉన్న గౌరవాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని, కష్టాల్లో ఉన్న తనకి ఇప్పుడు మహేష్ లాటి స్టార్ అవసరం ఎంతైనా ఉందని మణిరత్నం ఓ ఇద్దరు హీరోల సబ్జెక్ట్ రెడీ చేస్తున్నాడు. ఈ చిత్రంలో మహేష్ ఆర్య హీరోలుగా నటిస్తారని, ఈ చిత్ర కథకి పూర్తి రూపం వచ్చిన తర్వాత ఆయా హీరోల డేట్స్ కోసం సంప్రదిస్తానని అంటున్నాడు..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X