twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్లను అలా వాడుకోవడం చేతకాదు.. నా కుమారుడికీ ఇంట్రస్ట్ లేదు.. మణిరత్నం

    మణిరత్నం, సుహాసిని దంపతుల కుమారుడు నందన్‌‌కు సినిమా రంగంపై ఎలాంటి ఆసక్తి లేదట. చెలియా విడుదల నేపథ్యంలో ఈ విషయాన్ని మణిరత్నం మీడియాకు వెల్లడించారు. నా కెరీర్‌లో మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలను చాలానే ర

    By Rajababu
    |

    సినిమా రంగం అంటేనే వారసత్వానికి పెద్దపీట. హీరో కొడుకు హీరో కావాల్సిందే. నిర్మాత కొడుకు కొంచెం చూడటానికి బాగుంటే హీరోగానో, లేదా తండ్రి బాటలోనే నడిచిన దాఖలాలు చాలానే ఉన్నాయి. కానీ సంచలన దర్శకుడు మణిరత్నం కుమారుడు మాత్రం అందుకు విభిన్నం. మణిరత్నం, సుహాసిని దంపతుల కుమారుడు నందన్‌‌కు సినిమా రంగంపై ఎలాంటి ఆసక్తి లేదట. చెలియా విడుదల నేపథ్యంలో ఈ విషయాన్ని మణిరత్నం మీడియాకు వెల్లడించారు.

     కుమారుడికి సినిమాలంటే ఇష్టం లేదు

    కుమారుడికి సినిమాలంటే ఇష్టం లేదు

    నా కుమారుడు నందన్‌కు సినిమాలు అంటే ఇష్టం లేదు. ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నాడు. విద్యావేత్తగా స్థిరపడాలన్నది నందన్ కోరిక. రాజకీయాల్లంటే చాలా ఆసక్తి. నేను చదువుకొన్నది ఒకటి. చేసే పని మరొకటి. జీవితంలో నేర్చుకొన్న విద్య ఎందుకు ఉపయోగపడలేదు. అలా అని విద్యపై నాకు ఎలాంటి ప్రతికూల అభిప్రాయం లేదు. చదువుకుంటే చెడిపోతారని నేను అసలు చెప్పను. చదువు అనే మనిషికి హోదా కల్పిస్తుంది అని మణిరత్నం అన్నారు.

    కొందరి జీవితాలకు సంబంధించిన కథ

    కొందరి జీవితాలకు సంబంధించిన కథ

    నా జీవితంలో నాకు తారసపడిన వ్యక్తుల జీవితాల్లో చోటుచేసుకొన్న కొన్ని అంశాలను స్ఫూర్తిగా తీసుకొని చెలియా చిత్రాన్ని రూపొందించాను. వాస్తవ జీవితంలోని కొన్ని ఎమోషన్స్‌ను తెరకెక్కించాను. దర్శకులకు నిజ జీవిత సంఘటనలే ఎక్కువగా స్ఫూర్తిగా నిలుస్తాయి అని మణి పేర్కొన్నారు.

     చెలియా పీరియాడిక్ ఫిలిం

    చెలియా పీరియాడిక్ ఫిలిం

    చెలియా చిత్రం సమకాలీన పరిస్థితుల ఆధారంగా నిర్మించిన చిత్రం కాదు. ఇది పిరియాడిక్ ఫిలిం. 90 దశకంలో జరిగిన సంఘటనలకు స్ఫూర్తి. బంధాలు, అనుబంధాలు, భావోద్వేగం తదితర అంశాల మేలవింపే చెలియా అని మణిరత్నం చెప్పుకొచ్చారు.

    మహిళలను అలవాడుకోవడం నచ్చదు

    మహిళలను అలవాడుకోవడం నచ్చదు

    మహిళా కథా చిత్రాలను తీయడం నాకు చాలా ఇష్టం. సినిమాలో మహిళలను శృంగారం కోసమే వాడుకోవడం నచ్చదు. నా కెరీర్‌లో మహిళా ప్రాధాన్యమున్న చిత్రాలను చాలానే రూపొందించాను. రోజా, సఖి, మౌనరాగం, చెలియా చిత్రాల కథలన్నీ మహిళల చుట్టే తిరుగుతాయి. వారే సినిమాను నడిపించారు అని మణిరత్నం అన్నారు.

     కార్తీ నటన అంటే ఇష్టం

    కార్తీ నటన అంటే ఇష్టం

    హీరో కార్తీ నాకు వ్యక్తిగతంగా ముందే పరిచయం. అతను నా వద్ద దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఇటీవల కార్తీ నటించిన సినిమాలు చూశాను. కొన్ని సినిమాల్లో అతని నటన ఆకట్టుకొన్నది. అందుకే చెలియాలో అవకాశం ఇచ్చాను అని మణిరత్నం చెప్పారు.

     భాష నేర్చుకుంటేనే అవకాశం..

    భాష నేర్చుకుంటేనే అవకాశం..

    చెలియా ప్రారంభానికి ముందు అదితికి ఆడిషన్ నిర్వహించాం. ఆమెను ఎంపిక చేయడానికి ముందు తమిళం నేర్చుకోవాలని చెప్పాం. ఎందుకంటే పాత్రను అర్థం చేసుకోవడానికి భాష చాలా ముఖ్యం. ఈ సినిమాలో ఆమె మనుసు పెట్టి నటించడం చాలా ఆనందమేసింది అని సంచలన దర్శకుడు వెల్లడించారు.

    34 ఏళ్లు.. 25 సినిమాలు

    34 ఏళ్లు.. 25 సినిమాలు

    మణిరత్నం పల్లవి అను పల్లవి అనే కన్నడ చిత్రంతో 1983లో సినీ కేరీర్‌ను ప్రారంభించారు. గత 34 ఏళ్ల సినీ జీవితంలో కేవలం 25 చిత్రాలే రూపొందించారు. రాశి కంటే వాసి మేలని నమ్ముతారు. తాజాగా కార్తీ, అదితీరావ్ హైదరీతో చెలియా అనే చిత్రాన్ని తీశారు. ఈ చిత్రం ఏప్రిల్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది.

    English summary
    'Cheliya' is not contemporary. It is a period film set in the backdrop of the late '90s. It's more like an intense, emotional relationship drama," says Maniratnam. He says his son Nandan is not interested in films. He is doing his PhD, is truly academic, and follows politics strongly!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X