మహేష్ బాబు కొరకు 80సీన్లతో స్క్రిప్ట్ రెడీ చేసుకొన్న మణిరత్నం..
ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతన్న 'దూకుడు" చిత్రంలో నటిస్తున్న మహేష్ బాబుకు మరో అరుదైన అవకాశం వచ్చిందని టాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు. రజనీకాంత్ తో 'రోబో" చిత్రాన్ని నిర్మించి అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన సన్ పిక్చర్స్ తమిళంలో ఒక చారిత్రాత్మక నలవలను సినిమాగా తీయాలని సంకల్సించింది. అమర్ కల్కి రచించిన 'పొన్ని యన్ సెల్వన్" నవలను సన్ పిక్చర్స్ ఎంచుకుంది. ఆ చిత్రానికి దర్శకత్వం వహించే పనిని మణిరత్నానికి అప్పగించాలని నిర్ణయించింది. విశ్వసనీయ వర్గాలు చెప్పిన దానిని బట్టి ఆ నవల మణిరత్నానికి ఎంతగానో నచ్చింది. దాంతో ఐదు సంపుటాల నవలను కేవలం 80 సీన్లతో చక్కని స్క్రిప్ట్‌గా మలిచారని సమాచారం.
తెలుగు,తమిళలో నిర్మించే ఈ సినిమా కథను పక్కాగా తయారు చేసినట్టు సమాచారం..అతి త్వరలో ఇది సెట్స్ మీదకు రానుంది..ఇప్పటికే మహేష్ బాబు..శంకర్ డైరక్షన్ లో త్రీఇడియట్స్ రీమేక్ లో నటిస్తున్నాడు. దీంతో పాటు..దూకుడు..లింగుస్వామి డైరక్షన్ లో వేట సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు..మరీ ఈ సినిమాలు మహేష్ బాబును ఏ స్థాయికి తీసుకెళతాయో వేచి చూడాల్సిందే...


Click it and Unblock the Notifications











