మనీషా కొయరాల ఆరోగ్య వివరాలపై నియంత్రణ
బాలీవుడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం మనీషా ఇటీవల నేపాల్ వెళ్లినప్పుడు అన్‌కాన్సియస్(చలనం లేని స్థితి)అయి పడిపోయారని, ముంబైలోని జాస్లోక్ ఆసుపత్రిలో చేరగా ఆమెకు క్యాన్సర్ ఉన్నట్లు రిపోర్ట్స్ వచ్చాయి. కొన్ని రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితి బాగోలేదని మనీషా కొయిలారా సన్నిహితులు అంటున్నారు. వైద్యులు ఆమెకు పలు రకాల టెస్టులు నిర్వహించారని, టెస్టు రిపోర్టులు వచ్చిన తర్వాత అంతా షాకయ్యారని వెల్లడించారు.
అయితే మీడియాలో మనీషా కొయరాల కేన్సర్ బారిన పడ్డట్లు వార్తలొచ్చాయి. దీనిపై మనీషా కుటుంబ సభ్యులెవరూ స్పందించలేదు. 1991లో 'సౌదాగర్'తో వెండి తెరకు పరిచయమైన ఈ నేపాలీ భామ అటు బాలీవుడ్, ఇటు దక్షిణాది చిత్రాల్లో నటించారు. 2010లో నేపాల్‌కి చెందిన సామ్రాట్ దహాల్‌ని పెళ్లి చేసుకొన్న తరవాత కొన్నాళ్లు తెరకు దూరమయ్యారు. ఇటీవలే రామ్‌గోపావల్ వర్మ తీసిన 'భూత్ రిటర్న్స్'తో మళ్లీ ముఖానికి రంగేసుకొన్నారు.


Click it and Unblock the Notifications












