twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనీషా కొయరాలా ఆరోగ్యం..కెరీర్..లేటెస్ట్ ఇన్ఫో

    By Srikanya
    |

    ముంబై: సర్వైకల్(అండాశయ) కాన్సర్ తో భాధపడి ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స పొందుతూ కోలుకుంటున్న మనీషా కోయిరాల తాజాగా ఓ చిత్రం కమిటైంది. ఆమె డైరెక్టర్‌ జయ్‌ ప్రకాశ్‌ నిర్మిస్తున్న 'మార్కెట్‌2' చిత్రంలో నటించనుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు జయ్‌ మాట్లాడుతూ, 'మనీషా వల్ల నాకు అదృష్టం కలిసివస్తుంది. ఆమె 'మార్కెట్‌' చిత్రంలోనూ నటించింది. ఆమెతో 'మార్కెట్‌2' చిత్రం స్క్రిప్ట్‌ గురించి చెప్పటం జరిగింది. ఆమెకు స్క్రిప్ట్‌ నచ్చింది. ఆమె చికిత్స నుంచి వచ్చిన తర్వాత మరోసారి వినిపిస్తాను.' అని అన్నారు.

    ఒక భర్త కట్టుకున్న భార్యను వ్యభిచార గృహానికి అమ్మివేసే కథా నేపథ్యంతో సాగే 'మార్కెట్‌' చిత్రం 2003లో విడుదలైంది. మళ్లీ దాదాపు పదేళ్ళ తర్వాత ''మార్కెట్‌2'' చిత్రాన్ని నిర్మించేందుకు దర్శకులు ప్రయత్నాలు చేపట్టారు. క్యాన్సర్‌తో బాధపడుతున్న మనీషా గత డిసెంబర్‌ నుంచి న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న విధితమే. ప్రస్తుతం కీమో థెరపీ చికిత్స పొందుున్న ఆమె జులై నెలలో భారత్‌కు వచ్చే అవకాశం ఉందని ఆమె మేనెజర్‌ సుబ్రతో ఘోష్‌ తెలిపారు.

    ఈ చిత్రంలో మనీషాను ఎంచుకోవడానికి గల కారణాలని గురించి జయ్‌ వివరిస్తు, ''మనీషా త్వరగా కోలుకుంటోందని ఆమె మేనేజర్‌ తెలిపాడు. ఆమె 4 నెలల్లో తిరిగి వస్తుంది. ఆమెతో కలిసి నేను 'మార్కెట్‌', 'చాహత్‌-ఏక్‌ నషా', చిత్రాలలో పనిచేశాను. ఆమె లేకుండా 'మార్కెట్‌2' చిత్రాన్ని ఊహించలేను.'' అని అన్నారు. హిందీతో పాటు పలు దక్షిణాది భాషా చిత్రాల్లో నటించిన మనీషాకు ''దిల్‌ సే''. ''బొంబాయి'', ''లజ్జ'' చిత్రాలలో నటనకు గాను మంచి గుర్తింపు లభించింది.

    కేన్సర్ బారిన పడి అనారోగ్యానికి గురైన మాజీ స్టార్ హీరోయిన్ మనీషా కొయిరాలకు అమెరికా వైద్యులు నిర్వహించిన సర్జరీ సక్సెస్ అయింది. సోమవారం ఉదయం ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం మనీషా కొయిరాలా కోలుకుంటోందని ఆమె మేనేజర్ సుబ్రతో ఘోష్ తెలిపారు.

    నేపాల్‌కు చెందిన మనీషా కొయిరాలా 1991లో 'సౌదాగర్' అనే చిత్రం ద్వారా భారతీయ సినీ రంగంలోకి అడుగు పెట్టింది. తన అంద చందాలు, నటనా నైపుణ్యంతో అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ మనీషా కొయిరాలకు అవకాశాలు వెల్లువెత్తాయి. వయసు పైబడ్డాక సినిమా అవకాశాలు తగ్గడంతో నేపాల్ చెందిన వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని అతనితో పొసగక విడిపోయింది.

    English summary
    Filmmaker Jay Prakash who directed the 2003-film Market with Manisha Koirala, is eager to sign the actress for Market 2 after she returns from her medical trip to New York. The director stated, "Manisha is my lucky charm. She was in my film Market and I had discussed the script of Market 2 with her. She liked the script. Once she is back after her treatment, I will again narrate the script to her.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X