త్రాగి పట్టుపడ్డ మాజీ స్టార్ హీరోయిన్
ఆ మధ్యన పెళ్లి చేసుకున్న ఒకప్పటి స్టార్ హీరోయిన్ మనీషా కొయిరాలా ఈ మధ్యన అనవసరమైన కారణాలతో మీడియాలోకి ఎక్కుతోంది.తాజాగా ఆమె ముంబైలోని ఓ ఆర్ట్ ఎగ్జిబిషన్ కి వచ్చి మీడియా దృష్టిలో పడింది. ఆమె స్నేహితులు అంతా ఆమెను కవర్ చేద్దామని చూసినా ఫలితం లేకుండాపోయింది.ఆమె పూర్తి నిషాలో అక్కడికి వచ్చిందని అక్కడ బాలీవుడ్ పత్రికలు,మీడియా వ్యాఖ్యానించింది.ఆమె నుంచి పూర్తిగా లిక్కర్ వాసన వచ్చిందని,మీడియా వారు అడిగిన ప్రశ్నలకు స్పష్టంగా ఒక్క పదం కూడా మాట్లాడి సమాధానం చెప్పలేక పోయిందని అన్నారు.చివరకు మీడియా వారు పట్టుపడితే...నేను ప్రస్తుతం నేపాల్ లోనే ఉంటున్నాను.అక్కడ మంచి జీవితమే గడుపుతున్నాను. నాది హ్యాపీ మ్యారీడ్ లైఫే.నాకు అబద్దాలు చెప్పాల్సిన అవసరం లేదంటూ వెళ్లిపోయింది.
ఇటీవల 'మాప్పిళ్లయ్" అనే తమిళ చిత్రంలో హీరో ధనుష్‌కి అత్తగా నటించిన మనీషా కొయిరాలా మలయాళం 'ఎలక్ట్రా"లో నయనతారకు తల్లిగా యాక్ట్ చేశారు. ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్స్ చూసిన మనీషా ఇప్పుడు పాత్ర బాగుంటే అక్క, వదిన, అమ్మ పాత్రలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ నేపాలీ బ్యూటీ ప్రస్తుతం గౌతమ్ బుద్ధుడి జీవితాన్ని ఆధారం చేసుకుని ఓ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారట. ఇప్పటివరకు దాదాపు 75 చిత్రాల్లో నటించారామె. ఆ అనుభవంతో దర్శకురాలిగా తన తొలి చిత్రాన్ని ప్రేక్షక రంజకంగా తీయడానికి మనీషా సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రాన్ని ఆరంభించాలనుకుంటున్నానని చెప్తోంది.


Click it and Unblock the Notifications











