మనీషా కొయిరాల విడాకుల నిర్ణయం
నేపాల్‌కు చెందిన వ్యాపార వేత్త సామ్రాట్ దహాల్‌ను పెళ్లి చేసుకున్న ఒకప్పటి బాలీవుడ్ బ్యూటీ మనీషా కొయిరాలా భర్తతో విడి పోవాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు ఆమె నేపాల్ నుంచి ముంబై చేరుకుంది. పెళ్లయిన ఆరు నెలలకే భర్తతో మనీషాకు విబేధాలు వచ్చాయి. ఆ మధ్య తాను విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో రాసి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
పెళ్లై నాలుగు నెలలు కూడా కాకుండా ఆమె ఇలాంటి వ్యాఖ్య చేయటంతో అంతా ఆశ్చర్యపోయారు. అయితే అప్పుడు తాను కేవలం కోపంలో రాసిన సంగతేనని పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదని శెలవిచ్చింది. ఆ తర్వాత కూడా భర్తకు మనీషాకు మధ్య పొసగక పోవడంతో చివరకు ఇప్పుడు విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయింది. మరి ఈ సారి నిజంగా విడాకులు తీసుకుంటుందో...లేక కోపంలో అలా అన్నా అని మాట మారుస్తుందో?
మనీషాతో త్వరలో రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా చేయబోతున్నారు. 'భూత్' చిత్రానికి సీక్వెల్‌గా 'భూ...' చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పూర్తిగా 3D ఫార్మాట్లో రూపొందిస్తున్నారు. ఇందులో అలనాటి సూపర్ హీరోయిన్ మనీషా కొయిరాలా కూడా కనిపించనుంది.


Click it and Unblock the Notifications












