మనీషా కొయరాలతో...ఆ ఒక్క క్షణం సూపర్
మనీషా కొయిరాలా ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం 'ఏక్ సెకన్..జో జిందగీ బదల్ దె' జూన్ 11న చిత్రాన్ని విడుదల కానుంది. పార్థో ఘోష్ దర్శకత్వం వహించిన ఈ ద్రిల్లర్ చిత్రంలో జాకీ ష్రాఫ్ మరో కీలక పాత్రధారి. ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడతూ "థ్రిల్లర్ తరహా కథాంశంతో 'ఏక్ సెకన్..' చిత్రాన్ని రూపొందించాం. ఒక సెకనులో జరిగే విచిత్రాలు మా సినిమాలో చాలానే ఉంటాయి. ఆనంద్ రాజ్ ఆనంద్ అందించిన సంగీతం చిత్రానికి అదనపు బలం. దామోదర్ నాయుడు, కుముద్ వర్మ కెమెరా పనితనం కూడా ఆకట్టుకొంటుంది అన్నారు. నిర్మాతలు రచనా సునీల్ సింగ్, అగస్త్య సింగ్ మాట్లాడుతూ...జీవితంలో ఒక సెకనుకు కూడా ఎంత ప్రాముఖ్యం ఉందో వివరించే ప్రయత్నం ఈ చిత్రంలో చేశామన్నారు. ప్రస్తుతం మనీషా కొయరాల...హన్సిక తల్లిగా మాపిళ్ళై అనే తమిళ చిత్రంలోనూ, నయనతారకు తల్లిగా ఎలక్ట్రా అనే మళయాళ చిత్రంలోనూ చేస్తోంది.


Click it and Unblock the Notifications