చికిత్స కోసం అమెరికా వెళ్లనున్న మనీషా
ముంబై: ఒకప్పడు బాలీవుడ్‌ను ఏలిన తారల్లో మనీషా కొయిరాలా ఒకరు. ఇటీవల మనీషీ అనారోగ్యానికి గురై ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆమె కేన్సర్ వ్యాధికి గురైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం ఈ విషయాన్ని ప్రకటించలేదు.
తాజాగా అందిన సమాచారం ప్రకారం మనీషా కొయిరాలా జస్లోల్ ఆసుపత్రిలో మూడు రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయింది. తర్వాతి చికిత్స నిమిత్సం ఆమె అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఫ్యామిలీతో కలిసి ఆమె అమెరికా వెళ్లనున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నేపాల్‌కు చెందిన మనీషా కొయిరాలా 1991లో 'సౌదాగర్' అనే చిత్రం ద్వారా భారతీయ సినీ రంగంలోకి అడుగు పెట్టింది. తన అంద చందాలు, నటనా నైపుణ్యంతో అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ మనీషా కొయిరాలకు అవకాశాలు వెల్లువెత్తాయి. వయసు పైబడ్డాక సినిమా అవకాశాలు తగ్గడంతో నేపాల్ చెందిన వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని అతనితో పొసగక విడిపోయింది.


Click it and Unblock the Notifications












