విచ్చల విడిగా తిరిగా, మద్యానికి బానిసగా.. అందుకే నా జీవితం అంధకారంలోకి అంటున్న హీరోయిన్!

మనీషా కొయిరాలా అంటే తెలియని సినీ అభిమాని ఉండరు. 90 దశకంలో సౌత్ లో ఈ భామ ఓ వెలుగు వెలిగింది. బ్లాక్ బస్టర్ విజయాలు మనీషా కొయిరాలా పేరున నమోదయ్యాయి. ఈ నేపాలీ అందం సౌత్ లో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇండియన్, బొంబాయి, ఒకే ఒక్కడు లాంటి చిత్రాల్లో మనీషా కొయిరాలా నటించింది. ఆ తర్వాత మనీషా క్యాన్సర్ వ్యాధికి గురికావడం, చాలా రోజులు ఆ వ్యాధితో పోరాడి కోలుకోవడం జరిగింది. క్యాన్సర్ వ్యాధితో మనీషా కొయిరాలా జీవితం ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్లిందని చెప్పొచ్చు. తాజాగా మనీషా కొయిరాలా తన జీవిత గాదని హేడెల్ అనే పుస్తక రూపంలో విడుదుల చేసింది.

వెస్ట్రన్ కల్చర్‌కు అలవాటు పడి

వెస్ట్రన్ కల్చర్‌కు అలవాటు పడి

తనకు క్యాన్సర్ వ్యాధి సోకడానికి ముఖ్యకారణం వెస్ట్రన్ కల్చర్ కు అలవాటు పడడం అని మనీషా తన పుస్తకంలో రాసింది. క్యాన్సర్ నుంచి కోలుకున్న తరువాత తాను చేసిన తప్పులన్నీ తనకు భోదపడుతున్నాయని, ఆ తప్పుల వలనే నా జీవితం అంధకారంలోకి వెళ్లిందని మనీషా దాపరికం లేకుండా చెప్పేసింది. తన జీవితంలో అలవర్చుకున్న చెడు అలవాట్ల కారణంగానే క్యాన్సర్ బారీన పడ్డట్లు మనీషా తెలిపింది.

ఆ సమయంలో విర్రవీగా

ఆ సమయంలో విర్రవీగా

వరుస చిత్రాలు, షూటింగ్ షెడ్యూల్స్ తో క్షణం కూడా తీరికలేకుండా గడుపుతున్న సమయంలో గర్వం నా తనకు ఎక్కింది. ప్రపంచం మొత్తం నా కాళ్ళ వద్దకు వచ్చింది విర్రవీగా. నేను భ్రమ పడుతున్నాని తెలియడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. 1999లో బిజీ షెడ్యూల్స్ కారణంగా ఒత్తిడిని తట్టుకోవడానికి పాశ్చాత్త అలవాట్లకు బానిసగా మారా.

 మద్యానికి బానిసగా

మద్యానికి బానిసగా

ఆ సమయంలో సన్నిహితులు, శ్రేయోభిలాషులు ఎంత చెబుతున్నా వినకుండా ఒంటరి తనం పోగొట్టుకునేందుకు విచ్చల విడిగా తిరిగానని మనీషా సంచలన విషయాలు వెల్లడించింది. తక్కువ సమయంలోనే మద్యానికి పూర్తిగా బానిసగా మారినట్లు చెప్పుకొచ్చింది. ఈ తప్పుల వలనే తనని క్యాన్సర్ కబళించినట్లు మనీషా తెలిపింది. కానీ క్యాన్సర్ వ్యాధి నా జీవితానికి ఒక బహుమతిగానే భావిస్తున్నా అని మనిషా తెలిపింది.

 ఇప్పుడు మారాను

ఇప్పుడు మారాను

గతంలో తాను స్టార్ గా ఉన్న సమయంలో చిన్న విషయాలకు కూడా కోపం ప్రదర్శించేదానిని. అభద్రతా భావం నాలో ఎక్కువగా ఉండేది. కానీ క్యాన్సర్ నుంచి కోలుకున్న తరువాత తాను పూర్తిగా మారానని మనిషా తెలిపింది. ఇప్పుడు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నానని మనీషా తన పుస్తకంలో పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X