మనీషా కొయిరాల కేన్సర్ సర్జరీ సక్సెస్
ముంబై : సర్వైకల్(అండాశయ) కేన్సర్ బారిన పడి అనారోగ్యానికి గురైన మాజీ స్టార్ హీరోయిన్ మనీషా కొయిరాలకు అమెరికా వైద్యులు నిర్వహించిన సర్జరీ సక్సెస్ అయింది. సోమవారం ఉదయం ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం మనీషా కొయిరాలా కోలుకుంటోందని ఆమె మేనేజర్ సుబ్రతో ఘోష్ తెలిపారు.
మనీషాతో పాటు ఆమె తల్లిదండ్రులు, సోదరుడు, ఒక స్నేహితురాలు ప్రస్తుతం ఆమెరికాలో ఆమె వెంట ఉన్నారు. ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి ఇండియాకు రానున్నారు. మనీషాకు కేన్సర్ సోకిన విషయం ఇటీవలే బయట పడింది. అస్వస్థతకు గురైన ఆమె ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో చేరగా టెస్టుల్లో సర్వైకల్ కేన్సర్ ఉన్నట్లు తేలింది.
నేపాల్‌కు చెందిన మనీషా కొయిరాలా 1991లో 'సౌదాగర్' అనే చిత్రం ద్వారా భారతీయ సినీ రంగంలోకి అడుగు పెట్టింది. తన అంద చందాలు, నటనా నైపుణ్యంతో అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగింది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ మనీషా కొయిరాలకు అవకాశాలు వెల్లువెత్తాయి. వయసు పైబడ్డాక సినిమా అవకాశాలు తగ్గడంతో నేపాల్ చెందిన వ్యాపార వేత్తను పెళ్లి చేసుకుని అతనితో పొసగక విడిపోయింది.


Click it and Unblock the Notifications












