త్రాగి మీడియాకు దొరికిన పెళ్లైన హీరోయిన్
ఒకప్పుడు ఒక వెలిగిన మాజీ హీరోయిన్ మనీషా కొయరాలా రీసెంట్ గా త్రాగి తూలుతూ మీడియోకు దొరికింది. దాంతో ఆమె ఫోటోలను మీడియా వారు ప్రచురించారు. ముంబైలో ఓ రెస్టారెంట్ ఓపినింగ్ లాంచ్ కి వెళ్లిన ఆమె బాగా త్రాగి మీడియా కళ్ళలో పడింది. ఆమె మాజీ బాయ్ ప్రెండ్ ప్రశాంత్ చౌదిరి ఈ రెస్టారెంట్ ని ఓపెన్ చేసారు. ఆయన పిలిస్తే వెళ్లి ఆమె రాత్రంతా త్రాగి వస్తూ ఫోటోగ్రాఫర్స్ కళ్లలో పడింది. నల్ల డ్రస్ వేసుకున్న ఆమె చాలా డల్ గా ఉంది. పార్టీకి ముందు ఆమె క్యాజువల్ గా ఉన్నా..వచ్చేటప్పుడు ఆమె చాలా డల్ అయ్యిపోయిందని ఆ పార్టీకి వెళ్లిన వారు వాఖ్యానిస్తున్నారు. ఇక ఆమెకు బాగా కావాల్సిన వారు ఆమెను తీసుకుని ఆ నడవలేని స్ధితిలో ఇంటికి చేర్చారు.
ఇక పెళ్లికి ముందు ఆమెకు డ్రింకింగ్ అలవాటు ఉన్నా అది కేవలం పార్టీలకే పరిమితం చేసింది కానీ ఇలా ఇంతలా రెగ్యులర్ గా త్రాగటం లేదని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఆమె ఇష్టపడి చేసుకున్న పెళ్లి విఫలమవటంతో ఆమె ఇంతలా త్రాగుడుకి బానిస అయ్యిందని చెప్తున్నారు. ఇక ఆమెకు ఇప్పుడు వివాహం పెద్ద సమస్యగా మారిందని, త్వరలో విడాకులు తీసుకోబోతోందని తెలుస్తోంది. అందుకే ఆమె వెంటనే మళ్ళీ తల్లి పాత్రలకు వచ్చి సినిమాలు చేయటం మొదలెట్టింది. ప్రస్తుతం ఆమెను మణిరత్నం ఆయన తీయబోయే రొమాంటిక్ కామిడీలో తీసుకుంటానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











