మనిషా కొయిరాలాకు అక్కడేం పని?
ఒకప్పటి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మనీషా కొయిరాలా ఇటీవల తప్ప తాగి ముంబైలో మీడియా కంట పడి వార్తల్లో వ్యక్తిగా నిలిచిన విషయం తెలిసిందే. తాజా ఈ భామ బెంగుళూరు శివార్లలోని ఓ ఫాం హౌజ్ లో కనిపించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. అయితే విషయం ఆరా తీయగా సినిమా షూటింగులో భాగంగానే ఆమె అక్కడికి వచ్చినట్లు తెలిసింది. 41 సంవత్సరాల ఈ భామ ప్రస్తుతం మలయాళంలో 'ఎడవపతి' అనే చిత్రంలో నటిస్తోంది. లెనిన్ రాజేంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ...తనకు కన్నడలో అవకాశాలు వస్తున్నాయని, త్వరలోనే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని చెప్పారు. ప్రస్తుతం సినిమా అవకాశాలు పెద్దగా లేని ఈ నేపాలీ భామ ఏ చిన్న అవకాశం వచ్చినా చేయడానికి సిద్ధంగా ఉంది.
నేపాలీ వ్యాపార వేత్తను పెళ్లాడిన మనీషా కొన్ని రోజులకే అతనికి దూరం అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఒంటరిగా జీవనం గడుపుతున్న మనీషా మద్యానికి బానిసైందని బాలీవుడ్లో చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











