మనీషా కొయరాలతో వర్మ '3డి' చిత్రం
మనీషా కొయరాలా,రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో గతంలో కంపెనీ చిత్రం వచ్చి విజయవంతమైన సంగతి తెలిసిందే. ఇప్పుడదే కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ మరో చిత్రం ప్లాన్ చేస్తున్నారు వర్మ. అయితే ఈ సారి ఆయన తనకు ఇష్టమైన హర్రర్ చిత్రం తీస్తున్నారు. 3డి లో చేసే ఈ హర్రర్ చిత్రం ఓ కొత్త అనుభూతిని ఇస్తూ సాగుతుంది అంటున్నారు. తెలుగు నుంచి జెడి చక్రవర్తి నటిస్తున్న ఈ చిత్రంలో మధుశాలిని కూడా ఓ కీ రోల్ చేస్తోంది. ఈ చిత్రం షూటింగ్ రీసెంట్ గా ముంబైలో మొదలైంది. ఆగస్టులో ఈ చిత్రం విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి ఆయన 'భూత్ 2' టైటిల్ పెట్టారు. 'భూత్'కి సీక్వెల్ అని చెప్తున్నారు. 2003లో ఆయన రూపొందించిన హిందీ చిత్రం 'భూత్'బాగానే ఆడింది. ఇప్పుడు ఆ చిత్రానికి రెండో భాగం తెరకెక్కించంటో మార్కెట్లో క్రేజ్ క్రియేట్ అవుతుందని భావిస్తున్నారు. అలాగే త్రీడీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందచటం కూడా సినిమాకు ప్లస్ అంటున్నారు. మనీషా కొయిరాలా, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలు పోషించబోతున్న ఈ చిత్రం మార్కెట్ లో ఎంత వరకూ క్రేజ్ తెచ్చుకుంటుంది ..ఇద్దరూ ఫేడవుట్ అయిన వాళ్లే కదా అని అంటున్నారు. మొదట ఈ చిత్రంలో ఊర్మిళను అనుకున్నారు కానీ చివరకు మనీషాని పిక్స్ చేసారు.
అలాగే ఆరేళ్ల చిన్నారి చుట్టూ కథ తిరుగుతుందని తెలిసింది. ప్రస్తుతం ముంబయిలో జేడీ, మనీషాలపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. ప్రేక్షకుల్ని ఎలాగైనా భయపెట్టాలన్నది రామ్‌గోపాల్‌వర్మ తన లక్ష్యం అని మరో సారి చెప్తున్నారు. 'రాత్రి' సినిమా నుంచి 'ఫూంక్' వరకూ ఆయన అడపాదడపా దెయ్యం కథల్ని జనం ముందుకు తీసుకొస్తూనే ఉన్నారు. అయితే అవేమీ ఆశించిన స్థాయిలో జనం భయపెట్టకపోవటంతో ఈ సినిమాతో అయినా భయపెడతానని హామీ ఇస్తున్నారు.
అలాగే పూర్తిగా ఫేడవుట్ అయిన మనీషా ఈ చిత్రమ్మీద ఆశలు పెంచుకొంది. మరోసారి ఈ చిత్రంతో బాలీవుడ్‌కి చేరువ కావాలని ఆశిస్తోంది. రెండేళ్ల కిందట సమ్రాట్ దహల్‌ని పెళ్లి చేసుకొన్న ఆమె చిత్రసీమకు దూరమైంది. వైవాహిక బంధం విచ్ఛిన్నం కావడంతో తిరిగి బాలీవుడ్‌కి చేరుకొంది. ఆ తరవాత 'ఐ యామ్' అనే చిత్రంలో నటించినా గుర్తింపు రాలేదు. 'భూత్ 2' ద్వారా మరోసారి వెలగాలన్నది ఆమె ఆశ. జెడీ సైతం ఈ చిత్రంతో తనకు బాలీవుడ్ మరో సారి ఆదరిస్తుందని భావిస్తున్నాడు. సత్య తర్వాత జెడీ చేసిన సినిమాలేమీ హిందీలో ఆ రేంజిలో ఆడలేదు.


Click it and Unblock the Notifications











