చిత్తూరు ఆశ్రమంలో సేదతీరుతున్న మనీషా కొయిరాల

ఈ సంవత్సరం కూడా మనీషా కొయిరాలా ఈ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ....ఇక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంటుందని, వన్ నెస్ యూనివర్శిటీ ఆధ్యాత్మిక వాతావరణం మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుందని తెలిపారు. క్యాన్సర్, ఇతర సమస్యలతో సతమతం అయిన తనకు బ్యాలెన్స్డ్ హ్యాపీ లైఫ్ ఎలా సాగించాలో ఇక్కడి టీచింగ్ ద్వారానే అర్థమయిందని తెలిపారు.
క్యాన్సర్ వ్యాధితో పోరాడే వారు డాక్టర్ల సలహాలు తప్పకుండా పాటించాలని, వ్యాయామం కూడా ఎంతో అవసరమని మనీషా కొయిరాలా సూచించారు. త్వరలో ఒక గర్ల్ చైల్డ్‌ని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను. త్వరలోనే అందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తానని ఆమె చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











