»   »  ప్రియుడితో హాట్ హీరోయిన్ రహస్య వివాహం, స్పందించిన తల్లి!

ప్రియుడితో హాట్ హీరోయిన్ రహస్య వివాహం, స్పందించిన తల్లి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సంగీత దర్శకుడు జివి ప్రకాష్ హీరోగా నటించిన ఓ తమిళ చిత్రం తెలుగులో ' త్రిష లేదా నయనతార' పేరుతో ఆ మధ్య రిలీజైంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లలో ఒకరిగా నటించిన మనీషా యాదవ్ ఇపుడు వార్తల్లో వ్యక్తిగా మారింది.

ఈ అమ్మడు బెంగుళూరుకు చెందిన ఓ బడా వ్యాపార వేత్త వార్నిడ్ ను రహస్యంగా పెళ్లి చేసుకుంది. తన స్నేహితులకు కూడా ఈ పెళ్లికి సంబంధించిన సమాచారం ఇవ్వలేదట. తనను హీరోయిన్ గా పరిచయం చేసిన దర్శకుడు బాలాజీ శక్తివేల్ కు కూడా ఈ విషయం చెప్పలేదట.

 స్పందించిన తల్లి

స్పందించిన తల్లి

మనీషా యాదవ్ రహస్య వివాహంపై ఆమె తల్లి యమున స్పందించారు. ఇరు కుటుంబాల అంగీకరాంతోనే వివాహం జరిగిందని తెలిపారు. రహస్య వివాహం అంటూ దీన్ని పెద్ద ఇష్యూ చేయొద్దని ఆమె కోరారు.

 కొంతకాలంగా ప్రచారం

కొంతకాలంగా ప్రచారం

మనీషా యాదవ్, వార్నిడ్ కొంతకాలంగా చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఇద్దరూ కలిసి త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే ఎవరికీ చెప్పకుండా ఇలా రహస్యంగా పెళ్లి చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

 బాయ్ ఫ్రెండ్

బాయ్ ఫ్రెండ్

మనీషా యాదవ్ తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు కొంతకాలంగా వార్తల్లో ఉన్న వ్యక్తి ఇతడే. ఇతడినే మనీషా యాదవ్ పెళ్లాడినట్లు ప్రచారం జరుగుతోంది.

 సినిమాల్లో నటిస్తుందా?

సినిమాల్లో నటిస్తుందా?

అయితే పెళ్లి తర్వాత మనీసా యాదవ్ సినిమాల్లో కంటిన్యూ అవుతుందా? లేక సినిమాలకు దూరం అవుతుందా? అనేది ఆమె భర్త నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుందని మనీషా యాదవ్ తల్లి యమున తెలిపారు.

English summary
Manisha Yadav who made her filmy telugu debut with the Tamil dubbing movie Trisha Leda Nayantara film is in the news now. The buzz is that Manisha Yadav was secretly married to her long time boyfriend.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu