twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నిర్మాతగా మారిన సంగీత దర్శకుడు మణిశర్మ

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రముఖ సంగీతదర్శకుడు మణిశర్మ నిర్మాతగా మారారు. ఆయన ఒక హిందీ సినిమా నిర్మిస్తున్నారు. పాకిస్తానీ నటి వీణామాలిక్‌తో ఆయన 'ముంబయ్ 125 కి.మీ' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో విష్ణు హీరోగా 'వస్తాడు నా రాజు' చిత్రానికి దర్శకత్వం వహించిన హేమంత్ మధుకర్ ఈ చిత్రానికి దర్శకుడు. అలాగే ఈ చిత్రానికి హేమంత్ కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

    ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోందని మణిశర్మ తెలిపారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ త్రీడి లో రూపొందిస్తున్నారు. ఇదో సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అని చెప్తున్నారు. గతంలో హేమంత్ మధుకర్ 'ఎ ఫ్లాట్' అనే హిందీ చిత్రానికి డెరైక్షన్ చేసి ఉన్నారు.

    ఇక వీణామాలిక్ ప్రస్తుతం తెలుగులో నగ్నసత్యం అనే చిత్రం చేస్తోంది.న్యూడ్ ఫోజులతో సంచలనం సృష్టించి సినిమా అవకాశాలు దక్కించుకున్న పాకిస్థానీ భామ వీణా మాలిక్ ప్రస్తుతం పలు బాలీవుడ్ చిత్రాలతో పాటు తెలుగులో 'నగ్న సత్యం' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె తెలుగు తెరపై అడుగిడిన నేపథ్యంలో శృంగార పరమైన సినిమాలు చేద్దామని కొందరు నిర్మాతలు సిద్ధం అయ్యారు. వీణా మాలిక్ ప్రస్తుతం తెలుగులో చేస్తున్న 'నగ్న సత్యం' సినిమాకు రూ. 1.5 కోట్లు తీసుకుంటోందట. ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్స్ గా ఉన్న వారికి కూడా ఈ రేంజిలో రేటు లేదు. అనురాధా ఫిలిమ్స్‌ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు 'నగ్న సత్యం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామారావు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సమర్పణ: చదలవాడ తిరుపతిరావు. చదలవాడ శ్రీనివాసరావు గతంలో అన్నావదిన, రిక్షారుద్రయ్య, వార్నింగ్, ప్రేమించాను నిన్నే చిత్రాలను నిర్మించారు.

    English summary
    Mumbai 125 KM 3D is a 2013 upcoming Indian horror film directed by Hemant Madhukar and starring Veena Malik, Karanvir Bohra, Vedita Pratap Singh, Vije Bhatia and Aparna Bajpai. This film is entirely shot on Stereoscopic 3D cameras. The film will be released in February 8, 2013 along with Akshay Kumar 's Special Chabbis.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X