ఒక్క సినిమా చాలు లైఫ్ మారిపోవటానికి ...అదే నిజం అంటోది బాలీవుడ్ క్రేజీ భామ మంజరి. ఆమె 2004 లో వచ్చిన Rok Sako To Rok Lo తో తెరంగ్రేటం చేసింది. కానీ అమీర్ ఖాన్ మేనల్లుడు హీరోగా నిర్మించిన జానే తూ వచ్చేదాకా ఆమె ఎవరికీ నచ్చలేదు. ఇప్పుడు ఆ సినిమా లో సెకెండ్ హీరోయిన్ గా చేసిన ఆమెకు బాలీవుడ్ దేముడెరుగు గానీ తెలుగులో వరస ఆఫర్లతో వెలిగిపోతోంది. ఇప్పటికే అల్లరినరేష్ ప్రక్కన సిద్దు ప్రమ్ శ్రీకాకుళం లో చేసిన ఈ చిన్నది ఇప్పుడు ఓ పెద్ద సినిమా పట్టింది. భారీ చిత్రాల నిర్మాత ఎమ్.యస్.రాజు దర్శకుడు బి.గోపాల్ తో చేస్తున్న మస్కాలో ఆమెను సెకెండ్ హీరోయిన్ గా సెలక్ట్ చేసారు. అలాగే మరో రెండు పెద్ద బ్యానర్ల వాళ్ళు ఆమెని సంప్రదించారని తెలుస్తోంది.ఇక ఆమె తమిళంలోనూ Muthirhai సినిమాతో రంగ ప్రవేశం చేస్తోంది. వీటిన్నటి మాట కన్నా మస్కా ద్వారానే ఆమె కు ఎక్కువ పేరు వస్తుందని భావిస్తోందిట.రామ్ హీరోగా చేస్తున్న ఈ సినిమా లో హన్సిక మెయిన్ హీరోయిన్ గా కమిటయ్యింది.