అన్నీ అయ్యాక పడక సుఖం కావాలన్నారు.. అందుకే తప్పుకున్నా.. ఎన్టీఆర్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్

తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలు, కొందరు దర్శకనిర్మాతలు అవకాశాల పేరుతో మహిళలను లైంగికంగా వంచిస్తున్నారని ఎప్పటినుంచో కామెంట్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ విషయమై చాలామంది హీరోయిన్లు నోరువిప్పి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా అదే విషయమై మాట్లాడుతూ మరో హీరోయిన్ మంజరి ఫడ్నిస్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. వివరాల్లోకి పోతే..

శ్రీ రెడ్డి దుమారం.. ఇప్పుడు ఆ హీరోయిన్

శ్రీ రెడ్డి దుమారం.. ఇప్పుడు ఆ హీరోయిన్

తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పేరుతో మోసాలు జరుగుతున్నాయని శ్రీ రెడ్డి లాంటి తార పెద్ద దుమారమే లేపింది. అప్పటినుంచి మొదలు ఈ అంశం నిత్యం చర్చనీయాంశంగా మారుతూనే ఉంది. రోజుకో హీరోయిన్ ఈ విషయమై కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే మంజరి ఫడ్నిస్ తెలుగు చిత్రసీమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని స్పష్టం చేసింది.

 అవకాశం ఇచ్చి, అడ్వాన్స్ కూడా ఇచ్చాక అది కావాలని అడిగారు

అవకాశం ఇచ్చి, అడ్వాన్స్ కూడా ఇచ్చాక అది కావాలని అడిగారు

కొందరు దర్శకనిర్మాతలు తనకు అవకాశం ఇచ్చి, అడ్వాన్స్ కూడా ఇచ్చారని.. అయితే తీరా ఆ సినిమాకు సంతకం చేసిన తర్వాత పడక సుఖం తీర్చాల్సిందిగా కోరేవారని చెప్పుకొచ్చింది. నిజానికి తనకు చాలా పెద్ద సినిమాల్లో అవకాశం వచ్చినా.. దర్శక నిర్మాతలు ఏమాత్రం సిగ్గులేకుండా పడుకుంటావా అని అడిగారని, అందుకే ఆ అవకాశాలు వదులుకున్నానని చెప్పింది మంజరి.

చాలా కాలం డిప్రెషన్‌లో ఉన్నా

చాలా కాలం డిప్రెషన్‌లో ఉన్నా

తాను సినిమాల్లో ఎక్కువకాలం కొనసాగలేక పోవడానికి ప్రధాన కారణం అదే అని చెప్పింది మంజరి. తన సినిమాల్లో కొన్ని బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవ్వడం, కాస్టింగ్ కౌచ్ వంటి విషయాల వలన చాలా కాలం డిప్రెషన్‌లో కూడా ఉండిపోయానని చెప్పుకొచ్చింది.

పడక సుఖం అందిస్తేనే అవకాశాలు

పడక సుఖం అందిస్తేనే అవకాశాలు

చిత్రసీమలో పడక సుఖం అందిస్తే తప్ప అవకాశాలు రావని మంజరి చేసిన ఈ ఆరోపణలు హాట్ టాపిక్ అయ్యాయి. గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించింది ఈ హీరోయిన్. తిరిగి మరోసారి బెడ్‌రూంకి వెళ్తేనే అవకాశాలు వస్తాయని సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

అమ్మాయిల కెరీర్‌తో ఆడుకుంటున్నారా?

అమ్మాయిల కెరీర్‌తో ఆడుకుంటున్నారా?

అందుకే టాలెంట్ ఉన్న హీరోయిన్లు కూడా పెద్ద సినిమాల్లో అవకాశాలు రాక చిన్న సినిమాలతో సరిపెట్టుకుంటున్నారని మంజరి పేర్కొంది. మంజరి ఫడ్నిస్ చేసిన ఈ వ్యాఖ్యలు సౌత్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. మన దగ్గర ఈ స్థాయిలో దర్శకనిర్మాతలు అమ్మాయిల కెరీర్‌తో ఆడుకుంటున్నారా? అనే కొత్త చర్చ మొదలైంది.

Recommended Video

CineBox: Mahesh Babu To Play Gangster | 90ML Movie Review | Disco Raja Teaser Review
ఇంతకీ ఎవరీ మంజరి ఫడ్నిస్

ఇంతకీ ఎవరీ మంజరి ఫడ్నిస్

హీరోయిన్ మంజరి ఫడ్నిస్ అనగానే ఠకీమని ఎవ్వరూ గుర్తుపట్టలేరు. ఎందుకంటే టాలీవుడ్‌లో అంత పాపులారిటీ తెచ్చుకోలేక పోయింది ఈ ముద్దుగుమ్మ. అల్లరి నరేష్ హీరోగా వచ్చిన సిద్దు ఫ్రం శ్రీకాకుళం, శుభప్రదం లాంటి సినిమాల్లో నటించిన ఈమె జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మెహర్ రమేష్ తెరకెక్కించిన 'శక్తి' సినిమాలో నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X