twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వరదల్లో చిక్కుకున్న హీరోయిన్.. ఆందోళనలో చిత్రయూనిట్.. చివరకు ఇదీ జరిగింది!

    |

    సినిమా షూటింగ్ నిమిత్తం ఉత్తర భారత దేశంలోని అందమైన ప్రదేశానికి వెళ్లిన ఓ సినిమా యూనిట్ ఊహించని విధంగా ప్రమాదంలో చిక్కుకున్నారు. అక్కడ భారీ వర్షాలు కురుస్తుండటంతో వారున్న ప్రదేశం నుంచి బయటపడలేని పరిస్థితి నెలకొంది. దీంతో ఆ విషయం తెలుసుకున్న కేంద్రమంత్రి వెంటనే సహాయం చేయాల్సిందిగా ఆదేశించారు. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగింది? పూర్తి వివరాలు చూస్తే..

    హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వరద బీభత్సం

    హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో వరద బీభత్సం

    ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. జనజీవనం స్తంభించిపోయి అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సరిగ్గా ఈ సమయంలో షూటింగ్ నిమిత్తం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లిన మళయాళ సినిమా యూనిట్ అనుకోని ఇబ్బందుల్లో పడింది.

    వరదల్లో చిక్కుకున్న హీరోయిన్

    వరదల్లో చిక్కుకున్న హీరోయిన్

    షూటింగ్ నిమిత్తం రెండు వారాల క్రితం హిమాచల్ ప్రదేశ్ మనాలీకి వంద కిలోమీటర్ల దూరంలో ఉండే చత్ర అనే ప్రదేశానికి మలయాళ హీరోయిన్ మంజు వారియర్ తో పాటు మరో 30 మందితో కూడిన చిత్ర యూనిట్ వెళ్లారు. అయితే ఉన్నట్టుండి భారీ వర్షాలు రావడం, వరదలు ముంచెత్తడంతో రోడ్లు కొట్టుకుపోయి వారంతా అక్కడి నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది.

    ఆందోళన చెందిన చిత్రయూనిట్.. సాయం కోసం

    ఆందోళన చెందిన చిత్రయూనిట్.. సాయం కోసం

    వరద ఉదృతి మరింత పెరుగుతండటంతో యూనిట్ సభ్యులు ఆందోళన చెందారు. ఈ మేరకు హీరోయిన్ మంజు వారియర్ తన సోదరుడికి ఫోన్ చేసి కన్నీరు పెట్టుకుందట. అతడి సలహా మేరకు సోషల్ మీడియా ద్వారా కేంద్రమంత్రి వి.మురళీధరన్‌ను సాయం కోరడంతో సహాయక చర్యలు చేపట్టారు.

     రాష్ట్ర ముఖ్యమంత్రి కలుగజేసుకొని

    రాష్ట్ర ముఖ్యమంత్రి కలుగజేసుకొని

    విషయం హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ వరకు వెళ్లడంతో ఆయన వెంటనే రెస్క్యూ టీంని బరిలోకి దించి మంజు వారియర్ తో పాటు ఆమె తోటి చిత్ర యూనిట్ సభ్యులను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. ప్రస్తుతం అందరూ సేఫ్ గా ఉన్నారని తెలిసింది.

    English summary
    Malayalam Actress Manju Warrier and director Sanal Kumar Sasidharan are stuck in Himachal Pradesh due to floods. Rescue team entered.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X