మహేష్ బాబు సోదరి సంచలన వీడియో: కుటుంబం, నాన్న ఫ్యాన్స్ వల్లే అంటూ....

‘మనసుకు నచ్చింది... పేరుతో మహేష్ బాబు సోదరి మంజుల ఓ వీడియో విడుదల చేశారు.

By Bojja Kumar

Recommended Video

మహేష్ బాబు సోదరి సంచలన వీడియో

సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంలో ఆయన కుమారులు రమేష్ బాబు, మహేష్ బాబు సినిమా రంగంలో హీరోగాలు ఎంట్రీ ఇచ్చారు. నటులుగా తమ సత్తా నిరూపించుకున్నారు. వీరి దారిలోనే కృష్ణ కూతురు మంజుల కూడా సినిమా రంగం వైపు అడుగులు వేయాలనుకున్నారు. హీరోయిన్ కావాలని కలలు కన్నారు.

అయితే అప్పటి పరిస్థితులు, కుటుంబ నేపథ్యం ఆమె హీరోయిన్ కావడానికి అడ్డంకిగా మారాయి. ముఖ్యంగా అప్పట్లో కృష్ణ అభిమానులు మంజుల హీరోయిన్ కావడాన్ని వ్యతిరేకించారని, ఈ పరిణామాల నేపథ్యంలో కృష్ణ కూడా తన కూతురును నటిగా పరిచయం చేసేందుకు ఇష్టపడలేదని అంటుంటారు.

సంచలన వీడియో విడుదల చేసిన మంజుల

సంచలన వీడియో విడుదల చేసిన మంజుల

నవంబర్ 8న తన పుట్టినరోజు సందర్భంగా మంజుల ‘మనసుకు నచ్చింది-ఫాలో యువర్ హార్ట్' పేరుతో వీడియో విడుదల చేశారు. ఇందులో ఆమె సంచలన విషయాలు చెప్పుకొచ్చారు. ఒక అమ్మాయిగా తాను ఎన్నో కలలు కన్నానని, వాటిని నెరవేర్చుకోలేక పోయానని మంజుల చెప్పుకొచ్చారు.

 హీరోయిన్ అవ్వాలనుకున్నా

హీరోయిన్ అవ్వాలనుకున్నా

నటిని కావాలని ఎన్నో కలలు కన్నాను. ఇందుకోసం ఎన్నోసార్లు ప్రయత్నించాను. కానీ అప్పటి పరిస్థితులు నా ఆశలను చిగురించకుండా చేశాయంటూ మంజుల తన మనసులోని మాటను చెప్పుకొచ్చారు.

 నా కుటుంబ నేపథ్యం, నాన్న అభిమానుల వల్లే

నా కుటుంబ నేపథ్యం, నాన్న అభిమానుల వల్లే

నా కుటుంబ నేపథ్యం, తన తండ్రి అభిమానులు, ఇంకా కొన్ని పరిస్థితులు తన కలలు, ఆశలు నెరవేరకుండా అడ్డంకిగా మారాయని మంజుల ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.

 తప్పు తెలుసుకునే సరికి ఆలస్యమైంది

తప్పు తెలుసుకునే సరికి ఆలస్యమైంది

అప్పట్లో తన తండ్రి అభిమానులే సమాజమని అనుకునేదాన్నని, అది తప్పని తెలుసుకునే సరికి చాలా ఆలస్యం అయిపోయింది... అని మంజుల వ్యాఖ్యానించారు.

 అవి సంతృప్తి ఇవ్వలేదు

అవి సంతృప్తి ఇవ్వలేదు

తన కల నెరవేర్చుకోలేక పోయాను అనే బాధ ఉండేది. బాధను మరిచిపోయేందుకు సినిమా నిర్మాణం వైపు వచ్చా. కానీ అది తనకు సంతృప్తి ఇవ్వలేదని మంజుల తెలిపారు.

 ఇపుడు కొత్త శక్తి వచ్చింది

ఇపుడు కొత్త శక్తి వచ్చింది

నా వైఫల్యానికి అసలు కారణం నేనే అని రియలైజ్ అయ్యాను. మనసు మార్చుకుని కొత్త బాధ్యతలు తీసుకోవడం ప్రారంభించాను. ఇపుడు కొత్త శక్తి నా శరీరంలోకి ప్రవేశించిన ఫీలింగ్ కలుగుతోంది అని మంజుల తెలిపారు.

మనసు చెప్పినట్టుగా నడుస్తున్నాను

ప్రయాణం ముఖ్యమేకానీ, గమ్యం ముఖ్యంకాదు. నాలోని ప్రతిభను గుర్చించి దానికి తగిన విధంగా ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాను. ఇపుడు మనసు చెప్పినట్టుగా నడవడం ప్రారంభించాను. విజయం సాధించాను అని మంజుల తెలిపారు.

మహేష్ బాబు స్పందన

దీనిపై మహేష్ స్పందిస్తూ, "హ్యాపీ బర్త్ డే టు మై డియరెస్ట్ సిస్టర్. ఫాలో యువర్ హార్ట్... కూల్‌ ఇనిసియేటివ్" అని ప్రశంసిస్తూ ఈ వీడియోను షేర్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X