బాలయ్య కోసం కృష్ణ కూతురు అనుకున్నారట.. చచ్చిపోతాం అనడంతో.. తప్పని పరిస్థితుల్లో!
సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల టాలీవుడ్ ఆడియన్స్‌కి సుపరిచితమే. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందామె. అయితే కృష్ణ కూతురిగా తాను ఎప్పుడో హీరోయిన్ కావాల్సిందని, కానీ ఫ్యాన్స్ చేసిన గొడవల కారణంగా ఆ అవకాశాలు వదులు కోవాల్సి వచ్చిందని అంటోంది మంజుల. ఆ మధ్య జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ విశేషాల గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పింది మంజుల. ఆ వివరాలు చూస్తే..

అప్పుడెప్పుడో హీరోయిన్ కావాల్సిన దాన్ని..
ప్రస్తుతం స్టార్ హీరోహీరోయిన్ల కొడుకులు, కూతుళ్లు వెండితెరపై కాలుమోపి సక్సెస్ సాధిస్తున్న సంగతి తెలిసిందే. తల్లిదండ్రుల ఇమేజ్ ప్రభావం వారిపై కూడా పడటం అలాంటి వారికి కాస్త కలిసొచ్చే అంశమని చెప్పుకోవచ్చు. అయితే ఈ కోవలోనే కృష్ణ కూతురు కూడా ఎప్పుడో హీరోయిన్ గా పరిచయం కావాల్సిందట. కానీ కొన్ని కారణాల వల్ల అది జరగలేదని మంజుల చెప్పుకొచ్చింది.

బాలయ్య కోసం అనుకోగా.. చివరకు
బాలకృష్ణ హీరోగా అప్పట్లో వచ్చిన 'టాప్ హీరో' సినిమాలోనే మంజులను హీరోయిన్‌గా తీసుకోవాలని భావించారట. కానీ నాన్న.. కృష్ణ ఫ్యాన్స్ గొడవ పెట్టడంతో అది కాస్త జరగలేదని చెప్పింది మంజుల. అదే జరిగుంటే 1994లోనే తాను హీరోయిన్ గా పరిచయమయ్యే దాన్నని తెలిపింది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'టాప్ హీరో' సినిమాలో బాలకృష్ణ సరసన సౌందర్య నటించి స్టార్ స్టేటస్ పొందిన సంగతి తెలిసిందే.

తగలబెట్టుకుని చచ్చిపోతాం అన్నారు
టాప్ హీరో ఆఫర్ వచ్చిందని తెలిసి నాన్నగారి అభిమానులు పెద్ద గొడవ చేశారని మంజుల తెలిపింది. నల్ల ముసుగులు ధరించి, పెట్రోల్ క్యానులు పట్టుకుని స్టూడియోకు వచ్చి నాన్నగారి ముందు నిలబడి 'మంజుల నటిస్తే తగలబెట్టుకుని చచ్చిపోతాం' అని వాదనకు దిగారని, దీంతో
వాళ్ళని అన్నయ్యలుగా భావించి వారి నిర్ణయానికి గౌరవమిస్తూ తాను నటించలేదని పేర్కొంది మంజుల.

మంజుల సినీ జర్నీ
కృష్ణ కూతురు మంజుల నిర్మాతగా ''పోకిరి, ఏమాయ చేసావె'' వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలను రూపొందించింది. ఆ తర్వాత 'మనసుకు నచ్చింది' సినిమా ద్వారా మెగాఫోన్ పట్టి దర్శకురాలిగా మారింది. ఆ తర్వాత మంజుల ''షో, ఆరెంజ్, సేవకుడు'' లాంటి సినిమాల్లో కూడా నటించి మంచి స్పందన తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











